23-07-2025 12:00:00 AM
ఇల్లందు టౌన్ ,జులై22, (విజయక్రాంతి): సిపిఎం పార్టీ జాతీయ నేత, కేరళ మాజీ ముఖ్యమంత్రి వీఎస్ అచ్యుతానందన్ గుండె పోటుతో మృతి చెందగా పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మండల పార్టీ కార్యదర్శి ఆలేటి కిరణ్ కుమార్ అధ్యక్షతన జరిగిన సభలో పార్టీ జిల్లా కమిటీ స భ్యులు అబ్దుల్ నబి పాల్గొని మాట్లాడా రు.
ఈ కార్యక్రమంలో పార్టీ మండల కమిటి స భ్యులు తాళ్లూరి కృష్ణ, సుల్తాన, ఖాదర్ , మునిగంటి లక్ష్మీ, సర్వన్ కుమార్, కామ నా గరాజు సత్యనారాయణ కోరి రమేష్, లక్ష్మణ్ పాసి, రాము, వెంకటేశ్వర్లు, యూసుఫ్ తదితరులు పాల్గొన్నారు.