calender_icon.png 24 August, 2025 | 4:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అగ్రిగోల్డ్ ఏజెంట్ బర్రోత్ వెంకటేశ్వర్లు మృతికి నివాళి

14-03-2025 12:37:22 AM

వైరా,(విజయక్రాంతి): ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం, లచ్చగూడెం గ్రామానికి చెందిన అగ్రిగోల్డ్ ఏజెంట్ బర్రోత్ వెంకటేశ్వర్లు మనోవేదనకుగురై గుండెపోటుతో బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు మరణించారు. అగ్రిగోల్డ్ సంస్థలో 15 లక్షల రూపాయలు డిపాజిట్ చేసి నష్టపోయారు. 2015లో సంస్థను మూసివేయడంతో ఒక వైపు డిపాజిట్ దారుల వత్తిడి, మరోవైపు కష్టార్జితం నష్టపోయామనే మనోవేదనతో తీవ్రంగా క్రుంగిపోయి గుండె పోటుతో మరణించారు. సమాచారం తెలుసుకున్న అగ్రిగోల్డ్ బాధితుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గుడిమెట్ల రజిత గురువారం లచ్చగూడెం గ్రామం వెళ్ళి బర్రోత్ వెంకటేశ్వర్లు భౌతికకాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. నివాళులు అర్పించిన వారిలో అగ్రిగోల్డ్ బాదితుల సంఘం రాష్ట్ర కోశాధికారి మద్దినేని రామారావు, ఏన్కుర్ మండల అధ్యక్షుడు ఎస్.డి.పాషా, సినియర్ ఏజెంట్ పామనరావు తదితరులు పాల్గొన్నారు.