calender_icon.png 10 October, 2025 | 1:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో కాన్షీరాం వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు..

09-10-2025 08:33:23 PM

బాన్సువాడ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో గురువారం కాన్షీరాం వర్ధంతి సందర్భంగా ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం నాయకులు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు బంగారు మైసయ్య మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీల ఐక్యత కోరుతూ బహుజన రాజ్యం రావాలని అనేక పోరాటాలు చేసి ఉత్తర ప్రదేశ్ లో రాజ్యాధికారం సాధించిన వ్యక్తి మాన్యశ్రీ కాన్షీరాం భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రలలో బహుజన రాజ్యం రావాలని కోరుకున్న మొదటి వ్యక్తి మాన్యశ్రీ కాన్షీరాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు గైని రవి బాన్సువాడ డివిజన్ ఉపాధ్యక్షులు మన్నే చిన్న సాయిలు దేశాయిపేట అంబేద్కర్ సంఘ అధ్యక్షులున్యాల కంటి గంగాధర్ మాల మహానాడు నాయకులు వాగ్మారే మారుతీ ఆర్టీసీ దుర్కి సక్కి సురేష్ పాల్గొన్నారు.