09-10-2025 08:30:23 PM
సీఎం రేవంత్ రెడ్డి అహంకార ధోరణితో బీసీలకు తీవ్ర నష్టం..
హామీల అమలులో కాంగ్రెస్ ఘోర వైఫల్యం..
మన బాకీ కార్డు ప్రజల బ్రహ్మాస్త్రం కావాలి..
పార్టీ పట్ల విధేయత, ప్రతిష్ఠ పెంచే నాయకులు మన దగ్గర ఉండడం బలం..
మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి..
వనపర్తి (విజయక్రాంతి): కోర్టు తీర్పుతో సంబంధం లేకుండా ఎన్నికల సమరం సాగించాలని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అహంకార ధోరణితో బీసీలకు తీవ్ర నష్టమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి(Former Minister Singireddy Niranjan Reddy) అన్నారు. గురువారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఘనపురం మండల పార్టీ అధ్యక్షులు రాళ్ళ కృష్ణయ్య అధ్యక్షతన ఎన్నికల సన్నాహక సమావేశంను గురువారం నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీమంత్రి ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీకి ఉన్న సమర్థవంతమైన నాయకులు సుశిక్షితులైన కార్యకర్తలు ఇతర సాంప్రదాయ పార్టీలకు లేరని ఇది మనకు బలమన్నారు. కోర్టు తీర్పుతో సంబంధం లేకుండా ఎన్నికల సమరం సాగించాలని ప్రతినిత్యం ప్రభుత్వ వైఫల్యం ప్రజలలోకి తీసుకెళ్లాలని సూచించారు. బాకీ కార్డుల పంపిణీకి ప్రజల నుండి అనూహ్య స్పందన వస్తుందని ప్రతి ఇంటికి వెళ్లి బాకీ కార్డు ద్వారా ప్రభుత్వం ఇచ్చిన హామీలలో బకాయి పడ్డ రూపాయలను ప్రజలకు వివరించాలన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి అభివృద్ధి చేయకుండా నిత్యం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని.. రేవంత్ రెడ్డి ప్రైవేట్ వ్యవస్థను నడుపుతున్నారని.. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. 22 నెలల్లో ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారం మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా 55000, వృద్ధులకు వికలాంగులకు ఫించన్ల ద్వారా 44000, రైతులకు ఒక్క ఎకరానికి 76000, కళ్యాణ లక్ష్మీ ద్వారా తులం బంగారం, నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు విద్యార్థులకు విద్యా బరోసా విద్యార్థినులకు స్కూటీలు బకాయి పడ్డారు అని ఈ విషయాన్ని బాకీ కార్డుల ద్వారా కాంగ్రెస్ పార్టీ నాయకులను నిలదీయాలని ప్రజలకు విజ్ఞప్తి చేయాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ కిట్టు, కంటివెలుగు, బతుకమ్మ చీరలు, రంజాన్ తోఫా వంటి పథకాలకు మంగళం పలికారన్నారు. ఘనపూర్ మండల బీఆర్ఎస్ పార్టీ కంచుకోట అని రాబోవు ఎన్నికల్లో మన పార్టీ అభ్యర్థులు ఘనవిజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమములో జిల్లా పార్టీ అధ్యక్షుడు గట్టు యాదవ్, మాజీ ఎం.పి.పి కృష్ణా నాయక్, జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్, మాజీ జెడ్.పి.టి.సి సామ్య నాయక్, రంగారెడ్డి, బాలేశ్వేర్ రెడ్డి, జాతృ నాయక్,వెంకట్ రెడ్డి మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ పార్టీలో పలువరి చేరిక..
ఘనపూర్ మండల తిరుమలయపల్లి నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎం.వెంకట్ రెడ్డి ఆధ్వర్యములో నారాయణ, బుడ్డయ్య, కృష్ణయ్య, దాసు, నర్సింలు తిరుమలేశ్, పెబ్బేరు మండలం సుగర్ గ్రామానికి చెందిన రిటైర్డ్ ఆర్.టి. సి ఉద్యోగి మాల. ఆంజనేయులు, మాజీ ఉపసర్పంచ్ మొగిలమ్మ, శ్రీనివాసులు, బెక్కెం రఘు, హనుమన్న, జయరాం, దశరథం, భాస్కర్, పులేందర్, బాలరాజు గౌడ్ తదితరులు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమములో వనం రాములు, పెద్దింటి వెంకటేష్, మధు,వడ్డే రమేష్, గోవిందు నాయుడు తదితరులు ఉన్నారు.