09-10-2025 08:35:47 PM
అలంపూర్: ఎలాంటి అనుమతులు లేకుండా జాతీయ రహదారిపై అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు లారీలను పట్టుకున్నట్లు ఎస్ఐ చంద్రకాంత్ తెలిపారు. గురువారం తెల్లవారుజామున తాడిపత్రి నుంచి హైదరాబాదుకు వెళ్తున్న రెండు ఇసుక లారీలను మానవపాడు స్టేజి సమీపంలో పట్టుకుని డ్రైవర్ సాయికుమార్, భాను ప్రకాష్ పై నమోదు నమోదు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు.
ఉండవల్లి పీఎస్ పరిధిలో మరొకటి
ఉండవల్లి పీఎస్ పరిధిలో జాతీయ రహదారిపై అలంపూర్ చౌరస్తాలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న లారీని పట్టుకుని డ్రైవర్ చిన్న కౌలుపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై శేఖర్ తెలిపారు.