14-01-2026 01:31:49 AM
హైదరాబాద్, జనవరి 13 (విజయక్రాంతి): సంక్రాంతి పండుగను పురస్కరించుకొని హెలె న్ కెల్లర్స్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో బీఎస్సీ ఆడియాలజీ అండ్ స్పీ లాంగ్వేజ్ పెతాలజీ, బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ విద్యార్థినులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. విద్యార్థిను లు ఉత్సాహంతో ఈ పోటీలో పాల్గొని వివిధ ఆకృతులలో ముగ్గులు వేసి వాటికి వివిధ రకాలైన రంగులను అద్దారు. అధ్యాపకులు, కాలేజి సిబ్బంది ఈ పోటీలలో పాల్గొన్నారు. మొదటి, ద్వితీయ, తృతీయ స్థాయి బహుమతులను అందజేశారు. కార్యక్రమానికి న్యాయ నిర్ణేతలు గా డా.ఆరుముగం, డా.శశిధర్‌రెడ్డి, డా.శ్రీవిద్య, డా.సుసన్, లెనిన్‌బాబు వ్యవహరించారు.