14 August, 2026 | 2:32 AM

మహిళ గుండెలో రక్త సరఫరాకు అడ్డుగా కణితి

14-08-2026 12:00 AM

శస్త్ర చికిత్సతో విజయవంతంగా తొలగించిన మెడికవర్ వైద్యులు

హైదరాబాద్, ఆగస్టు 13(విజయక్రాంతి): తొలిసారిగా గుండెలో రక్త సరఫరాకు అడ్డు గా ఉన్న కణితిని శస్త్ర చికిత్స ద్వారా విజయవంతంగా తొలగించినట్టు మెడికవర్ హాస్పి టల్స్ గుండె వైద్య నిపుణులు డాక్టర్ రాకేష్ కుమార్ తెలిపారు. నిజామాబాద్ జిల్లా కేం ద్రంలోని ఎల్లమ్మ గుట్టలో గల మెడికవర్ హాస్పిటల్స్‌లో ఏర్పాటు చేసిన మీడియా స మావేశంలో రాకేష్‌కుమార్ మాట్లాడుతూ సుమారు 40 ఏళ్ల వయసు గల మహిళ శ్వాస సంబంధిత, కాళ్లవాపులు తదితర సమస్యలతో మెడికవర్ హాస్పిటల్‌కి వచ్చింద న్నారు..

గుండెకు సంబంధించిన సమస్యలు రావడంతో పరీక్షించినట్టు వైద్య నిపుణులు తెలిపారు. అయితే ఆ పరీక్షల్లో గుండెలో ఏర్పడిన కణితి కారణంగా రక్తసరఫరాకు ఆ టంకం ఏర్పడిందన్నారు. గుండెలో ఏర్పడిన ప్రతి కణితి క్యాన్సర్‌కు సంబంధించింది కాదన్నారు. ఓపెన్ హార్ట్ సర్జరీ ద్వారా ఏదైతే గుం డెలో రక్త సరఫరాకు అడ్డుగా ఉన్న కణితిని తొలగించామన్నారు. దీంతో మహిళ ఆరోగ్యంగా వెళ్లిందని పేర్కొన్నారు. నిజామాబా ద్‌లో తొలిసారిగా ఇలాంటి క్లిష్టమైన గుండె శస్త్రచికిత్సను విజయవంతంగా చేశామన్నా రు.

మత్తు వైద్య నిపుణులు డాక్టర్ ఏలేటి వను, మెడికల్ హాస్పిటల్ డిప్యూటీ సూపరెంటెండెంట్ డాక్టర్ కూరపాటి యజ్ఞలు మా ట్లాడుతూ ఎంతో క్లిష్టమైన గుండె సర్జరీని గుండెలో కణితి కారణంగా రక్త సరఫరాకు ఆటంకం ఏర్పడటం అరుదైన, సవాలుతో కూడుకున్న పరిస్థితి అన్నారు. సకాలంలో గుర్తించి, సరైన సమయంలో శస్త్రచికిత్సతో మంచి ఫలితం అందించగలిగమన్నారు.  డాక్టర్ రాకేష్ నిపుణులైన వైద్యుల సూచన మేరకు సరైన చికిత్స తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్వామి, సెంటర్ హెడ్, డీఎంఎస్ యజ్ఞ, వినయ్‌కుమార్, మార్కెటింగ్ హెడ్ పాల్గొన్నారు.