14 August, 2026 | 1:31 AM

గ్రామీణ ప్రాంతాలకు ‘మెపా’ విస్తరిస్తాం

14-08-2026 12:00 AM

వెంకటాపూర్, ఆగస్టు 13 (విజయక్రాంతి): ముదిరాజ్ యువత రాజకీయంగా, ఆర్థికంగా ఎదగాలంటే ముదిరాజ్ ఎంప్లాయిస్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ లోకి రావాలని మెపా వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు పులి దేవేందర్ అన్నారు. మండలంలోని వెల్తూర్లపల్లి గ్రామంలో గురువారం జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు అధ్యక్షతన ‘పల్లె పల్లెకు మెపా’ కార్యక్రమాన్ని నిర్వహించగా, ఈ సందర్భంగా దేవేందర్ మాట్లాడుతూ.. గౌడలు, చేనేత వృత్తి కార్మికులకు అందిస్తున్న తరహాలో 50 సంవత్సరాలు నిండిన ప్రతి ముదిరాజ్కు ప్రత్యేక పెన్షన్ అందించాలని, ఈ విషయంపై మంత్రి వాకిటి శ్రీహరి ప్రత్యేక చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ముదిరాజ్ల సామాజిక, ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం మరిన్ని సంక్షేమ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని, మెపా కార్యకలాపాలు కేవలం పట్టణ ప్రాంతాలకే పరిమితం కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి పల్లెకు తీసుకెళ్లే లక్ష్యంతో ‘పల్లె పల్లెకు మెపా’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మెపా జిల్లా ఉపాధ్యక్షుడు నరేష్, మండల అధ్యక్షుడు రమేష్, రాందాస్, దేవేందర్, సంజీవ్, రాజయ్య, శ్రావణ్, శివసాగర్, శ్యాంసుందర్, గణపతి, దామోదర్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.