మేడిపల్లి ఏసీపీ ఆఫీస్‌ను తనిఖీ చేసిన సీపీ సుమతి
మేడిపల్లి, ఆగస్టు 13 (విజయక్రాంతి): మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసు అధికారుల పనితీరును పరిశీలించే క్రమంలో సీపీ సుమతి గురువారం మేడిపల్లి ఏసీపీ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్కు చేరుకున్న సీపీకి సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు. అనంతరం పోలీస్స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు.
ఉప్పల్ డీసీపీ సురేష్ కు మార్తో కలిసి మేడిపల్లి ఏసీపీ మోహన్ కుమార్తో పాటు ఏసీపీ పరిధిలోని ఇన్స్పెక్టర్లతో సీపీ సు మతి సమీక్ష నిర్వహించారు. ఏసీపీ పరిధిలో నమోదైన కేసులు, పెండింగ్ కేసుల దర్యాప్తు, సిబ్బంది వివరాలు, సమస్యలపై ఆరా తీశారు. నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించాలని, నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని సిబ్బందికి సూచించారు. దసరా లోపు మల్కాజిగిరి కమిషనరేట్ నూతన కార్యాలయాన్ని ప్రారంభిస్తామని చెప్పారు.






