11-08-2024 11:08:17 AM
బెంగళూరు: కర్ణాటక హోస్పేటలో తుంగభద్ర డ్యామ్ వద్ద కలకలం రేగింది. తుంగభద్ర డ్యామ్ 19వ గేట్ చైన్ లింక్ తెగిపోయింది. దీంతో తీర ప్రాంతాలకు అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. భారీ వర్షాలతో తుంగభద్ర నిండుకుండలా మారింది. రిజర్వాయర్ గేట్ తెగిపడటంతో వేల క్యూసెక్కుల నీరు దిగువకు పోటెత్తింది. తాత్కాలిక గేట్ ఏర్పాటుకు అధికారులు చర్యలు చేపట్టారు. కృష్ణా నది పరీవాహనక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచించారు. కర్నూలు జిల్లా కౌతాలం, కోసిగి, మంత్రాలయం, నందవరం మండలాల ప్రజలు అలర్ట్గా ఉండాలని అధికారులు హెచ్చరించారు.