03-08-2025 10:17:52 AM
కాకినాడ: కాకినాడ జిల్లా(Kakinada District) సామర్లకోటలోని సీతారామ కాలనీలో గుర్తు తెలియని దుండగులు ముగ్గురిని హత్య చేసిన ఘటన కలకలం రేపింది. శనివారం రాత్రి ఒక మహిళ, ఆమె ఇద్దరు చిన్న కుమార్తెలు తమ ఇంట్లో దారుణంగా హత్యకు గురైన సంఘటన అందరిని కలచివేసింది. ఈరోజు ఉదయం స్థానిక ప్రజలు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనస్థలికి చేరుకున్న పోలీసులు మృతుల వివరాలు వెల్లడించారు. మూలపతి మాధురి(30), ఆమె కుమార్తెలు పుష్పకుమారి(5), జెస్సిలోనా(4)గా గుర్తించారు. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం, గుర్తు తెలియని దుండగులు ముగ్గురిపై దాడి చేసి వారి తలపై తీవ్రంగా కొట్టగా.. ముగ్గురూ అక్కడికక్కడే మరణించారు.