calender_icon.png 3 August, 2025 | 1:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కరీంనగర్‌లో శ్రీవారి ఆలయ నిర్మాణ పనులు ప్రారంభించాలి

03-08-2025 10:59:26 AM

తిరుమల: బీఆర్ఎస్ మాజీమంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్(MLA Gangula Kamalakar) ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మీడియాతో మాట్లాడుతూ... టీటీడీలో ప్రసాదాలు నాణ్యతగా ఉన్నాయన్నారు. కరీంనగర్(Karimnagar)లో శ్రీవారి ఆలయ నిర్మాణానికి 10 ఎకరాలు కేటాయించారని, రెండేళ్లుగా ఆలయ నిర్మాణ పనులు ప్రారంభం కాలేదని పేర్కొన్నారు. త్వరగా ఆలయ నిర్మాణ పనులు చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు(AP CM Chandrababu Naidu), అదనపు ఈవోకు విజ్జప్తి చేస్తున్నానని కోరారు. అవసరమైతే సీఎం చంద్రబాబును కలుస్తానని గంగుల కమలాకర్ తెలిపారు.