calender_icon.png 3 August, 2025 | 2:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్పీడీసీఎల్, జెన్‌కో అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి సమీక్ష

03-08-2025 11:54:24 AM

హైదరాబాద్: నాగర్‌కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్ మండలం సోమశిల వద్ద విద్యుత్ శాఖ ఎస్పీడీసీఎల్(SPDCL), జెన్‌కో అధికారులతో ఆదివారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ పంపుసెట్లకు సోలార్ విద్యుత్‌ను విస్తృతంగా అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను సూచించారు. రాష్ట్రంలో పవన విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింత పెంచే దిశగా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశాలు జారీ చేశారు.

అలాగే పాంప్డ్ స్టోరేజ్ విద్యుత్ ఉత్పత్తిపై ప్రత్యేక దృష్టి సారించి అవసరమైన చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ప్రజల కోసమే పనిచేస్తున్న ప్రజా ప్రభుత్వంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన బాధ్యత మనందరిదీ అని... పునరుత్పత్తి విద్యుత్ అభివృద్ధి, గ్రామీణ విద్యుత్ అవసరాల తీర్చడం ద్వారా తెలంగాణను విద్యుత్ పరంగా స్వయం సమృద్ధిగా తీర్చిదిద్దే దిశగా చర్యలు తీసుకుంటున్నామని సమీక్ష ద్వారా వెల్లడించారు.