03-08-2025 11:03:54 AM
రెండు బైకులు ఢీ యువకుడు మృతి..
నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): టర్నింగ్ అయ్యే ముందు బైక్ ఇండికేటర్ వేయకపోవడంతో వెనకాల నుండి వస్తున్న మరో బైక్ ఢీకొట్టడంతో దానిపై ప్రయాణిస్తున్న యువకుడు మృతి చెందిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లా(Nagarkurnool District) కేంద్రంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రానికి చెందిన ప్రవీణ్ అనే యువకుడు శనివారం సాయంత్రం నెల్లికొండ చౌరస్తాలోని తన కట్టెల మిషన్ వద్దకు వెళుతుందగా పట్టనానికి చెందిన మరో ఇద్దరు మైనర్ బాలురు అదే సమయంలో టీ తాగేందుకు అక్కడే ఉన్న కేఫ్ వద్దకు టర్న్ అయ్యారు.
ఈ క్రమంలో రోడ్ సేఫ్టీ నిబంధనలు పాటించకపోవడంతో వెనకాల నుంచి స్కూటీపై వచ్చిన ప్రవీణ్ అనే యువకుడు వీరి బైకును ఢీకొట్టడంతో ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ప్రవీణ అనే యువకుడికి తలకు బలమైన గాయం కావడంతో వెంటనే జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించగా మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమద్యలో మృతి చెందాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.