03-08-2025 11:12:48 AM
ప్రతి ఒక్కరూ స్వయంకృషితో ఎదిగేలా పాటు పడతాం..
శాంతి భద్రతలకు భంగం కల్పిస్తే సహించేది లేదు..
రైతును రాజుగా మారుస్తాం కమాన్ పూర్ మార్కెట్ కమిటీ పాలకవర్గం సన్మాన సభలో మంత్రి శ్రీధర్ బాబు..
కమాన్ పూర్ (విజయక్రాంతి): మంథని నియోజకవర్గంలో హింసకు పాల్పడే వారిని పుట్టగతులు లేకుండా చేస్తామని మంత్రి దుద్దుల శ్రీధర్ బాబు(Minister Duddilla Sridhar Babu) హెచ్చరించారు. కమాన్ పూర్ మండల కేంద్రంలో నూతనంగా నియామకమైన ఏఎంసి మార్కెట్ కమిటీ(AMC Market Committee) పాలకవర్గం సన్మాన సభలో మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. మంథని నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ స్వయంకృషితో ఎదిగేలా పాటు పెడతానని, ఇక్కడ శాంతి భద్రతలకు భంగం కల్పిస్తే సహించేది లేదన్నారు. రైతును రాజుగా మారుస్తామని, కాంగ్రెస్ పార్టీ అంటేనే అహింసా మార్గాన్ని నమ్ముకొని గాంధీ మార్గంలో నడుస్తున్నామని, ఎవరైనా కూడా చిన్న హింసకు పాల్పడిన వ్యక్తిని ఊపేక్షించేది లేదని మంత్రి తెలిపారు. హింసకు పాల్పడేవారిని గుర్తించి చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని అన్నారు.
కొంతమంది మంథని నియోజకవర్గాన్ని కావల్సుకుని లేనిది ఉన్నట్లు ఉన్నది లేనట్లు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, మంథని ప్రజలు అన్ని గుర్తిస్తున్నారని, తమకు మద్దతుగా నిలుస్తున్న ప్రతి ఒక్కరికి అండగా ఉంటారని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు వైస్ చైర్మన్ రాజయ్య లు కాంగ్రెస్ పార్టీ కోసం నిరంతర కృషి చేశారని, గతంలో అధికార పార్టీ వేధింపులు తట్టుకొని నిలిచారని, పార్టీ కోసం కష్టపడ్డ వారికి గుర్తింపును ఇచ్చేందుకే వారికి ఈ పదవులు వచ్చాయని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ వెన్నెల రాజు వైస్ చైర్మన్ మద్దిల రాజయ్య డైరెక్టర్లు, జిల్లా గ్రంధాలయ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్, కమాన్ పూర్ పిఎసిఎస్ చైర్మన్ భాస్కరరావు, మాజీ ఎంపీపీ కోలేటి మారుతి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు చొప్పరి సదానందం, కమాన్ పూర్, ముత్తారం మండల అధ్యక్షులు అన్వర్, దొడ్డ బాలాజీ, పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.