calender_icon.png 31 January, 2026 | 12:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తుర్కయంజాల్‌కు ఆధ్యాత్మిక శోభ

31-01-2026 12:00:00 AM

  1. రాగన్నగూడలో మహారుద్ర సహిత సహస్ర చండీ యాగం
  2. పాల్గొన్న రాష్ట్ర రోడ్డు డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రాంరెడ్డి

తుర్కయంజాల్, జనవరి 30: జీహెచ్‌ఎంసీ పరిధి అదిభట్ల సర్కిల్ తొర్రూరు, తుర్కయంజాల్ డివిజన్లు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. రాగన్నగూడలో శ్రీ రేణుకా రాజరాజేశ్వరి పీఠం ఆధ్వర్యంలో... మేళ్ళూరి నవీన్ శర్మ పర్యవేక్షణలో మహారుద్ర సహిత సహస్రచండీ మహాయాగం వైభవంగా సాగుతోంది. శుక్రవారం జరిగిన పలు కార్యక్రమాల్లో తెలంగాణ రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రాంరెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. ఇబ్రహీంపట్నం ప్రాంతంలో ఇంతటి మహత్కర కార్యక్రమం చేపట్టడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో తుర్క యంజాల్ మున్సిపాలిటీ 22వ వార్డు మాజీ కౌన్సిలర్, కౌన్సిల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ కొశికె ఐలయ్య, తుర్కయంజాల్ ప్రథమ పూజారి సునీల్ శర్మ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు సామ భీంరెడ్డి, కొంతం వెంకట్ రెడ్డి (జానీ), జయేందర్ రెడ్డి, బీజేపీ తుర్కయంజాల్ అధ్యక్షుడు ఎలిమినేటి నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.