31-01-2026 12:00:00 AM
సికింద్రాబాద్ జనవరి 30 (విజయ క్రాంతి): బోయిన్‌పల్లి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వ్యవసాయ మార్కెట్ గ్రేడ్ వన్ కార్యదర్శిగా ఈ.వెంకటేశం బాధ్యతలు చేపట్టారు. గతంలో ఇక్కడ ఉన్న కార్యదర్శి వెంకన్న నల్గొండ జిల్లా మిర్యాలగూడ మార్కెట్ కు బదిలీ కావడంతో ఆయన స్థానంలో అక్కడి నుండే ఈ. వెంకటేశం ఇక్కడికి వచ్చారు. బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను మిర్యాలగూడ మార్కెట్ ఎంతగానో అభివృద్ధి చేశానని అదేవిధంగా ఇక్కడ కూడా మార్కెట్ను అభివృద్ధి చేస్తానని చెప్పారు. మార్కెట్లో రైతులకు,కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అభివృద్ధి చేస్తానని, కమిషన్ వ్యాపారుల కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటారని తెలియజేశారు.