09-10-2025 12:30:37 AM
హైదరాబాద్, అక్టోబర్ 8 (విజయక్రాంతి): విద్యార్థులు తమ జీవితంలో ఎదురై న అడ్డంకులను, సవాళ్లను నూతన అవకాశాలుగా మార్చుకోవాలని విజ్ఞాన్స్ యూని వర్సిటీ డైరెక్టర్ ప్రొఫెసర్ వైవీ దాసేశ్వరరావు పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం దేవశ్‌ముఖిలోని విజ్ఞాన్స్ యూనివర్సిటీలో బుధవారం ఎంబీఏ మొదటి సంవత్సరం విద్యార్థులకు తరగతులు ప్రారంభమయ్యాయి.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హాజరయ్యారు. కార్యక్రమంలో విజ్ఞాన్స్ యూనివ ర్సిటీ డైరెక్టర్ ప్రొఫెసర్ వైవీ దాసేశ్వర రావు మాట్లాడుతూ.. తమ యూనివర్సిటీలో విద్యార్థులను చేర్పించిన తల్లిదండ్రులకు ధన్యవాదాలు, విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. తల్లిదండ్రులందరూ తమ పిల్లలను బాగా ప్రోత్సహించినట్లైతే వారు ఆరోగ్యంగా, మానసికంగా, సర్వతోముఖం గా అభివృద్ధి చెందుతారని తెలియజేశారు.
విద్యార్థులు కెరీర్లో రాణించడానికి ఆత్మ విశ్వాసం, నమ్మకం, క్రమ శిక్షణ, శ్రద్ధతో తమ చదువులను కొనసాగించాలని ఆయన సూచించారు. ఎంబీఏ పూర్తి చేసిన విద్యార్థులకు కెరీర్‌లో స్థిరపడటానికి అపారమైన అవకాశాలు ఉన్నాయని విజ్ఞాన్స్ యూనివర్సిటీ మేనెజ్మెంట్ స్టడీస్ విభాగ అధిపతి ప్రొఫెసర్ సరితా సత్పతి తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా ఉండే వివిధ రకాల సంస్థల్లో ఫైనాన్స్/మార్కెటింగ్/హ్యూమన్ రిసోర్స్ మేనేజర్ మొదలైన హోదాల్లో నియమితులు కావడానికి ప్రధాన వృత్తిపరమైన కో ర్సు.. ఎంబీఏ కోర్సేనని వివరించారు. తమ యూనివర్సిటీలో ఎన్‌ఈపీ-2020ను అనుసరిస్తామని, అత్యుత్తమ ఫ్యాకల్టీ ఉన్నారని చెప్పారు.