calender_icon.png 9 October, 2025 | 8:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బుధవారం బోధనకు ప్రాధాన్యత ఇవ్వాలి

09-10-2025 12:29:16 AM

జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

కొత్తపల్లి, అక్టోబరు 8 (విజయక్రాంతి) : ప్రభుత్వ పాఠశాలల్లో బుధవారం బోధన కార్యక్రమానికి ప్రాధాన్యత ఇస్తూ విద్యార్థులకు కఠినమైన అంశాలు, పాఠాలు నేర్పించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. బుధవారం కరీంనగర్ రూరల్ మండలం నగునూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ సందర్శించారు.

జడ్పీహెచ్‌ఎస్ లో ‘బుధవారం బోధన‘లో భాగంగా పదవ తరగతి విద్యార్థులు నేర్చుకుంటున్న అంశాలను పరిశీలించారు. ఆంగ్ల పాఠం నేర్చుకుంటుండగా ప్రతి విద్యార్థితో ఆంగ్ల పాఠాన్ని చదివించారు. పాఠాలు చదవడంలో మెళకువలు నేర్పారు.

అన్ని పాఠశాలల్లోని అన్ని తరగతుల్లో బుధవారం బోధన పకడ్బందీగా అమలు చేయాలని విద్యాధికారులను ఆదేశించారు. అనంతరం కలెక్టర్ నగునూరు అంగన్వాడి కేంద్రాన్ని, పల్లె దవాఖానను సందర్శించారు. కలెక్టర్ వెంట జిల్లా వైద్యాధికారి వెంకటరమణ, ప్రోగ్రాం ఆఫీసర్ సనా, తహసిల్దార్ రాజేష్, ఎంఈఓ రవీందర్ ఉన్నారు.