06-07-2025 12:25:20 AM
మేషం
ఈ రాశి వారికి గ్రహస్థితి మధ్యరకముగా ఉన్నది. ఏమితోచకుండా ఉండును. ప్రారంభించి న పనులు సకాలములో పూర్తి కావు. ఆర్థిక పరిస్థితి బాగుండదు. బంధుమిత్రులతో జాగ్రత్త. శుభవార్తలు వింటారు. యువతీయువకులకు పెళ్లి విషయంలో జాప్యం. ఉద్యోగప్రయత్నాలలో ఆలస్యం. ఉద్యోగస్తులకు ఒత్తిడి పెరుగును. వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండవలెను. విద్యార్థులు చదువులలో శ్రద్ధచూపరు. మొత్తం మీద ఈ రాశివారికి 25శాతం అనుకూలం, 75శాతం ప్రతికూలం.
వృషభం
ఈ రాశి వారికి ఈ వారంలో గ్రహస్థితి అనుకూలం గా ఉన్నది. గొప్పవారితో పరిచయాలు కలుగును. బంధువులతో సంతోషంగా గడుపుతారు. ప్రారంభించిన పనులు విజయం. యువతీయువకులకు పెండ్లి విష యములో శుభం జరుగును. ఉద్యోగస్తులకు జీతములు పెరుగును. వ్యాపారస్తులకు లాభాలు. విదేశీ ప్రయత్నాలు ఫలించును. రైతులు శుభవార్తలు వింటారు. మొత్తం మీద ఈ రాశివారికి 70 శాతం అనుకూలం, 30 శాతం ప్రతికూలం.
మిథునం
ఈ రాశి వారికి ఈ వారంలో గ్రహస్థితి మధ్యరకముగా ఉన్నది. తొందరపడి నిర్ణయా లు తీసుకోరాదు. ధనవ్యయమగును. బంధువులతో, మిత్రులతో విరోధములు కలుగును. యువతీయువకుల కు ఉద్యోగ, వివాహ ప్రయత్నాలలో జాప్యము. విద్యార్థులు శ్రద్ధతో చదువవలెను. వ్యాపారస్తులు, రైతులకు సామా న్యలాభాలు ఉండును. ఉద్యోగస్తులు ఒత్తిడిలకు లోనగుదురు. మొత్తం మీద ఈ రాశి వారికి 45శాతం అనుకూలం, 55శాతం ప్రతికూలం.
కర్కాటకం
ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి శుభకరముగా ఉన్నది. ధనలాభం, స్నేహి తులతో ఉత్సాహంగా గడుపుదురు. కొత్తవారితో పరిచయాలు ఏర్పడు, బం ధువులతో ఆనందంగా గడుపుతారు. యువతీయువకులకు అనుకున్నట్లు వివాహములు జరుగును. ఉద్యోగప్రయత్నాలు ఫలించును. విద్యార్థులు ఇష్టంతో చదువుతు ఉన్నతిని సాధిస్తారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్, వ్యాపారస్తులు, రైతులకు లాభాలు. మొత్తం మీద ఈ రాశివారికి 80శాతం అనుకూలం, 20శాతము ప్రతికూలం.
సింహం
ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి సామాన్యముగా ఉన్నది. ఆత్మీయులతో బంధము పెరుగును. ప్రయాణాలవల్ల అనారోగ్యము. యువతీయువకులకు ఉద్యోగ, వివాహ ప్రయత్నములు తొందరగా ఫలించవు. విద్యార్థులు చదువులలో మందుకు వెళ్ళుదురు. వ్యాపా రస్తులకు, రైతులకు అనుకున్నలాభాలు రావు. ఉద్యోగస్తులకు శ్రమ అధికం, ఫలము స్వల్పంగా ఉండును. మొత్తం మీద ఈరాశివారికి 50 శాతం, అనుకూలం 50 శాతం ప్రతికూలం.
కన్య
ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి అనుకూలముగా ఉన్నది. చేసే ప్రయత్నాలు ఫలించును. పూజలు, అన్నదానాలు చేస్తారు. సాధు సత్పురుషులను కలుస్తారు. ఆకస్మిక ధనలాభము కలుగును. శుభకార్యాలు చేస్తారు. భూమికొనే అవకాశమున్నది యువతీయువకులకు ఉద్యోగ, వివాహనిశ్చయాలు జరుగును. విద్యార్థులకు చదువు, ఉద్యోగాలలో ఉన్నతి ఉన్నది. వ్యాపారస్తులకు, రైతులకు అధిక కలుగును. మొత్తం మీద ఈరాశివారికి 75శాతం అనుకూలం, 25శాతం ప్రతికూలం.
తుల
ఈ రాశి వారికి ఈ వా రంలో గ్రహస్థితి మిశ్రమం గా ఉన్నది. శుభకార్యాలు చేస్తారు. ప్రారంభించిన పనులు పూర్తియగును. పెట్టుబ డులకు సరైన సమయము కాదు. బంధువులతో వైరుధ్యాలు. దూర ప్రయాణాల వల్ల అనారోగ్యం. నిందలకు లోనగుదురు. యువతీయువ కులకు ఉద్యోగ, వివాహవిషయములో అధిక ప్రయత్నము అవసర ము. -ఉద్యోగస్తులకు కొంత ఊరట. వ్యాపారస్తులకు, రైతులకు మంచికాలము కాదు. మొత్తం మీద ఈ రాశివారికి 40శాతం అనుకూలం, 80 శాతం ప్రతికూలం.
వృశ్చికం
ఈ రాశివారికి ఈ వా రంలో గ్రహస్థితి మధ్యరకంగా ఉన్నది. వేగిరపడరాదు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. భూసంబందమైన కలహాలు ఏర్పడును. కొన్ని శుభ కార్యాలు చేయుదురు. ధనవ్యయం, శుభవార్తలు వింటారు. దూరప్రయాణముల తో అస్వస్థత. యువతీయువకులకు ఉద్యో గ, పెళ్లి ప్రయత్నాలలో పురోగతి. విద్యార్థులు ఉన్నత ఫలితములు పొందుదురు. వ్యాపారస్తులకు, రైతులకు లాభనష్టాలు సమానం. ఉద్యోగులు శుభవార్తలు వింటారు. మొత్తం మీద ఈరాశివారికి 50 శాతం అనుకూలం, 50శాతం ప్రతికూలం ఉన్నది.
ధనుస్సు
ఈ రాశివారికి ఈవారంలో గ్రహస్థితి మధ్యరకం గా ఉన్నది. ధనలాభాలు కలుగును. బంధువులతో సంతోషంగా గడుపుతారు. నూతన గృహనిర్మాణ ఆలోచనలు చేస్తా రు. బంగారం, వాహనాలు లాంటి ఖరీదై న వస్తువులనుకొంటారు. ధనవ్యయం, ఆరోగ్య సమస్యలు. యువతీయువకులకు ఉద్యోగా, వివాహ ప్రయత్నాలు లాభిస్తా యి. వ్యాపారస్తులు, రైతులు జాగ్రత్తగా ఉండవలెను. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి. మొత్తం మీద ఈరాశివారికి 50శాతం అనుకూలం, 50శాతం ప్రతికూలం.
మకరం
ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి అనుకూలం గా ఉన్నది. తలచిన పనులు పూర్తవుతా యి. శుభవార్తలు వింటారు. నూతన వాహనయోగం. మంచివారితో పరిచమా లు కలుగును. ఉద్యోగ, వివాహ ప్రయత్నా లు ఫలించును. - విద్యార్థులు చదువులలో శుభవార్తలు వింటారు. వ్యాపారస్తులు, రైతులు లాభాలు. మొత్తం మీద ఈ రాశివారికి 50 శాతం అనుకూలం, 50 శాతం ప్రతికూలం.
కుంభం
ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి మధ్యరకముగా ఉన్నది. బంధువుమిత్రులతో వినోదాలలో పాల్గొంటారు. జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. అశాంతిగా ఉండు ను. ధనవ్యయము అగును. యువతీయువకుల ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు ఫలించును. విద్యార్థులు ఉన్నత పురోగతి పొందుతారు. వ్యాపారస్తులకు, రైతులకు సామాన్యలాభాలు కలుగును. ఉద్యోగస్తులకు ధనలాభముకలుగును. మొత్తంమీద ఈ రాశివారికి 45 శాతం అనుకూలం, 55 శాతం ప్రతికూలం
మీనం
ఈ రాశివారికి ఈవారంలో గ్రహస్థితి సామాన్య ముగా ఉంది. బంధువులతో సంతోషంగా గడుపుతారు. చేసే పనులు ఆలస్యము అగును. శుభకార్యనిమిత్తమై ఖర్చులగును. భూసంబంధమైన సమస్యలు ఏర్పడును. దూరప్రయాణాలు చేస్తారు.
యువతీయువకులకు ఉద్యోగ, వివాహప్రయత్నాలు ఫలించును. విద్యార్థులు చదువులలో ప్రయత్నశీలులై ఉండుదురు. వ్యాపారస్తులకు, రైతులకు స్వల్ప లాభాలు కలుగును. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. మొ త్తం మీద ఈ రాశివారికి 45శాతం అనుకూలం, 55శాతం ప్రతికూలం.