calender_icon.png 6 July, 2025 | 9:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సెలక్షన్ లిస్ట్ విడుదల

06-07-2025 01:00:12 AM

- మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు ప్రకటన

- ఆయుష్ మెడికల్ ఆఫీసర్ పోస్టుల జాబితా

-మెరుగైన వైద్య సేవలే లక్ష్యంగా ప్రభుత్వ నిర్ణయం

హైదరాబాద్, జూలై 5 (విజయక్రాంతి): ఆయుష్ మెడికల్ ఆఫీసర్, ఎం ఎన్‌జే క్యాన్సర్ హాస్పిటల్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు సంబంధించిన సెలక్షన్ లిస్ట్‌ను మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు శనివారం విడుదల చేసింది. ఆయుష్ మెడికల్ ఆఫీసర్ పోస్టులు 156 ఉండగా, ఎంఎన్‌జేలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు 45 ఉన్నాయి.

ఈ పోస్టు లకు ఎంపికైన వారి వివరాలను బోర్డు ప్రకటించింది. ఈ పోస్టుల భర్తీతో ఆయు ష్ వైద్య సేవలు మరింత మెరుగు అవుతాయని మంత్రి దామోదర రాజనర్సిం హ హర్షం వ్యక్తం చేశారు. రాష్ర్టంలో ఆయుష్ వైద్య సేవలను బలోపేతం చేసేందుకు తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. 

ఆయుష్‌లో ఇటీవలే సుమారు 630 వరకు యోగా ఇన్‌స్ట్రక్టర్లను నియమించామని, మరో 200లకు పైగా పోస్టులకు నోటిఫికేషన్లు ఇచ్చామన్నారు. కేన్సర్ పేషెంట్ల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కేన్సర్ వైద్య సేవలను విస్తరిస్తున్నామని మంత్రి తెలిపారు. కొత్తగా 45 మంది డాక్టర్ల నియామకంతో ఎంఎన్‌జే కేన్సర్ హాస్పిటల్‌లో వైద్య సేవలు మరింత మెరుగవుతాయన్నారు.

జిల్లాలకు కూడా ప్రభుత్వ కేన్సర్ వైద్య సేవలను విస్తరిస్తున్నామని ఈ సందర్భంగా మంత్రి వెల్లడించారు. కొత్త జిల్లాల్లో డిస్ట్రిక్ట్ కేన్సర్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో రీజనల్ కేన్సర్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. ఈ సెంటర్లు అందుబా టులోకి వచ్చాక... పేషెంట్లు హైదరాబాద్ వరకూ రావాల్సిన అవసరం ఉండదన్నారు. జిల్లా స్థాయిలోనే మెరుగైన వైద్య సేవలు అందుతాయన్నారు.