calender_icon.png 6 July, 2025 | 10:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గోదావరి పుష్కరాలకు నిధులేవీ?

06-07-2025 01:03:42 AM

ఏపీకి ఇప్పటికే కేంద్రం వందకోట్లు.. తెలంగాణకు సున్నా

హైదరాబాద్, జూలై 5 (విజయక్రాంతి): గోదావరి పుష్కరాల నిర్వహణ కు నిధుల విడుదలలో కేంద్రం వివక్ష కొనసాగుతూనే ఉంది. 2015లో జరిగిన గోదావరి పుష్కరాలకు నిధులు ఇవ్వని కేంద్రం ఇప్పుడూ అదే వైఖరి అవలంబిస్తోంది. గోదావరి పుష్కరాలు 2027లో జూలై 23 నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు జరుగనున్నాయి.

ఈ పుష్కరాలకు సం బంధించిన ఏర్పాట్లను తెలంగాణ ప్రభు త్వం వేగవంతంగా చేపడుతోంది. కోట్లమంది భక్తులు పవిత్ర పుష్కర స్నానాల కు వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోం ది. ఇటీవలనే కాళేశ్వరంలో సరస్వతీ పుష్కరాలను విజయవంతంగా నిర్వహించిన తెలంగాణ ప్రభుత్వం రాబోయే గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు సమాయత్తం అయింది.

పుష్కరాల నిర్వహణకు ఘాట్ల ఏర్పాట్లు, వాటి అభివృద్ది, భక్తులకు మౌలిక వసతుల కల్పన, నదీ పరివాహక దేవాలయాల అభివృద్ధి తదితర పనులకు పెద్దఎత్తున నిధుల అవసరాన్ని ప్రభుత్వం గుర్తించింది. దానికి తగ్గట్లుగా ఏర్పాట్లు చేస్తోంది. అయితే కేంద్రం నుంచి నిధుల కావాలని రాష్ట్రం కోరుకుంటుంది.  ఈ నెల 12న గోదావరి తీరంలోని బాసర క్షేత్రంలో పుష్కర పనులను దేవాదాయ మంత్రి కొండా సురేఖ పరిశీలించనున్నా రు.

తెలంగాణలో పుష్కరాలు భక్తుల ఆకాంక్షల మేర జరగాలంటే కేంద్రం కూడా సాయం చేయాలని రాష్ట్రం డిమా ండ్ చేస్తున్నా, దానికి భిన్నంగా కేంద్రం వ్యవహరిస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం రాజమండ్రి పరిధిలో గోదావరి ఘాట్ల అభివృద్ధికి రూ.904 కోట్లతో బడ్జెట్ ప్రతిపాదించగా కేంద్రం ముందస్తుగానే గోదావరి పుష్కరాల కోసం నిధులు కేటాయించింది. ఇప్పటికే రూ 100 కోట్లను పుష్కరాల కోసం ప్రకటించారు.

తాజాగా రైల్వే శాఖ పుష్కరాలకు వచ్చే భక్తుల సౌకర్యాల కల్ప న కోసం రాజమండ్రి రైల్వేస్టేషన్‌కు రూ 271.43 కోట్లు కేటాయిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దేశంలో ప్రధాన ప్రాంతాల నుంచి రాజమండ్రికి ప్రత్యేక రైళ్లు నడుపుతామని,  ముందస్తుగానే ఖరా రు చేస్తామని అధికారులు వెల్లడించారు. ఏపీకి రూ.100 కోట్లు ఇచ్చిన కేంద్రం, 18 శాతం భూభాగంలో గోదావరి ప్రవహిస్తున్న తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడంపై తెలంగాణ ప్రజలు మండి పడుతున్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభు త్వం అధికారంలో ఉన్నంత మాత్రాన ఇలా వివక్ష చూపించటం సరికాదని అసహనం వ్యక్తం చేస్తున్నారు.  మన దేశంలో గంగా నది తర్వాత అంతపెద్ద నది గోదావరి. గోదావరి 1465 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. ఈ నది ప్రవహించే రాష్ట్రాలను పరిశీలిస్తే మహారాష్ట్రలో 48.6శాతం, తెలంగాణలో 18.8 శాతం, ఏపీలో 4.5శాతం, చత్తీస్‌గఢ్‌లో 10.9శాతం, ఒడిషాలో 5.7శాతం ప్రవహిస్తుంది.

గోదావరి నది ప్రవహించే కిలో మీటర్లలో మహారాష్ట్ర తర్వాత రెండో స్థానం లో ఉంది. ఈ గోదావరి నదికి అనేక వేల సంవత్సరాలుగా గొప్ప సాంస్కృతిక వారసత్వంతో కూడిన గోదావరి పుష్కరాలకు అత్యంత ప్రాశస్యత ఉంది. గోదావరి 12 పవి త్ర నదుల్లో ఒకటిగా పేరొందింది. 12 సంవత్సరాలకు ఒకసారి ఈ పుష్కరాలు జరుగు తున్నాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2015 తొలిసారిగా పుష్కరాలను అప్పటి ప్రభుత్వం నిర్వహించింది.

అటు ఆంధ్రప్రదేశ్ కూడా అదే సమయంలో ఈ పుష్క రాలను నిర్వహించింది. 2015లో పుష్కరాలు జులై 14న ప్రారంభమై 12 రోజుల తర్వాత జులై 25న ముగిశాయి. 2015 సంవత్సరంలో జరిగిన పుష్కరాల్లో తెలంగాణలో 5.7కోట్ల మంది పవిత్ర పుష్కర స్నానాలు ఆచరించినట్లుగా గణాంకాలు చెప్తున్నాయి. 2015 పుష్కరాల్లో అన్ని ముఖ్యమైన పీఠాల పీఠాధిపతులను అప్పటి ప్రభుత్వం ఆహ్వానించి నిర్వహించింది.

అప్పటి ప్రభుత్వం గోదావరి పుష్కరాల నిర్వహణకు 405.13 కోట్ల అంచనా వ్యయం వేసుకున్నా 500 కోట్లకు చేరుకుందని అధికారులు తెలిపారు. అప్పుడు నిర్వహించిన పుష్కర నిర్వహణకు నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని ఎన్నిసార్లు కోరినా నిధులు ఇవ్వలేదన్న విమర్శలు అప్పట్లోనే వెల్లువెత్తాయి.

కేంద్రం నుంచి ఎలాంటి సాయం అందలేదన్న విమర్శలు అప్పుడు తెలంగాణ వాదులు విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడిన సంవత్సర కాలంలోనే ఈ పుష్కరాలు రావడంతో ఆ పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. ఉమ్మడి ఏపీలో తెలంగాణలో 27 పుష్కర ఘాట్లు ఉంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత వాటిని 106 ఘాట్లకు పెంచారు. దాదాపు 500 కోట్లను పుష్కర నిర్వహణకు వెచ్చించినట్లు అధికారులు తెలిపారు.

స్పందన లేదు: మంత్రి కొండా సురేఖ

గోదావరి పుష్కరాల నిర్వహణకు తెలంగాణకు నిధుల కేటాయింపులు చేయాలని ఇటీవల లేఖ రాసినా కేంద్రం స్పందిస్తున్న తీరు సరికాదని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. ఇటీవల మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన ఆమె ఏపీకి మొదటి విడతగాకోట్లల్లో నిధులు కేటాయించిందని, ఇప్పటికే అక్కడ పనులు ప్రారంభమైతే తెలంగాణకు మాత్రం ఒక్క రూపాయి నిధులు కూడా ఇవ్వకపోవడం అన్యాయమన్నారు.

కేంద్రమంత్రిగా ఉన కిషన్ రెడ్డి జోక్యం చేసుకొని తెలంగాణకు నిధులను కేటాయించే విధంగా వ్యవహారించాలని మంత్రి సురేఖ అన్నారు. ఏపీతో సమానంగా తెలంగాణకు నిధులు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. ఇటీవలనే కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలను విజయ వంతంగా నిర్వహించామని మంత్రి సురేఖ తెలిపారు.