06-07-2025 01:06:40 AM
ఇందిరా మహిళా శక్తి సంబురాల్లో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క
మహిళలను ఓనర్లను చేశాం: మంత్రి సీతక్క
మహాలక్ష్మి పథకం వల్లనే ఆర్టీసీ బతికింది: మంత్రి పొన్నం
హైదరాబాద్, జూలై 5 (విజయక్రాంతి): మహిళా సాధికారతలో తెలం గాణ రాష్ట్రం ఒక రోల్ మోడల్‌గా నిలవాలని, దేశమంతా తెలంగాణకు వచ్చి చూసేలా ప్రభుత్వం అందిస్తున్న ప్రో త్సాహాన్ని మహిళా సంఘాలు అందిపుచ్చుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్ర మార్క పేర్కొన్నారు.
శనివారం ప్రజాభవన్‌లో ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో భాగంగా 151 మండల మహిళా సంఘాలకు ఆర్టీసీ నుంచి రావాల్సిన అద్దె రూ. 1.05 కోట్ల చెక్కు ను మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్‌లతో అందజేశారు. ఈ సందర్భంగా, రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని ప్రభు త్వం మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ముందుకు పోతుందని భట్టి విక్రమార్క అన్నారు.
పదేళ్లు పాలించిన బీఆర్‌ఎస్ వడ్డీ లేని రుణాలను, మహి ళా సంఘాలకు ప్రోత్సాహకాలను గాలికి వదిలేసిందని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తిరిగి వడ్డీ లేని రుణాలను ప్రారంభించి, ఇప్పటికే రెండుసార్లు వడ్డీ లేని రుణాల చెక్కులు పంపిణీ చేశామని గుర్తు చేశారు. మరోసారి వడ్డీలేని రుణాలను మహిళా సంఘాలకు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఉత్సవంలా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిపారు. ఆర్టీసీకి
ఇప్పించిన బస్సుల అద్దెను రూ. 1 కోటిని మహిళా సంఘాలకు అందజేయడం గొప్ప విషయమని హర్షం వ్యక్తం చేశారు. రాబో యే రోజుల్లో ఆర్టీసీ నుంచి పెద్దఎత్తున రాబడులు మహిళా సంఘాలకు అందుతాయని, త్వరలోనే వాటిని కూడా ప్రకటిస్తామని తెలిపారు.
కోటి మంది మహిళలను కోటీశ్వరు లను చేసే భాగంలో మొదటి సంవత్సరం రూ.21 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు మహి ళా సంఘాలకు అందించామని, ప్రతి ఏటా రూ. 20 వేల కోట్లకు తగ్గకుండా వడ్డీలేని రు ణాలు అందిస్తామని పేర్కొన్నారు. ఈ నెల 12వ తేదీ నుంచి 18వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా వడ్డీ లేని రుణాల చెక్కుల పంపిణీ కార్యక్రమం పెద్దఎత్తున చేపడుతున్నట్టు వెల్లడించారు.
మహిళలను ఓనర్లను చేశాం: మంత్రి సీతక్క
ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడంతోపాటు మహిళలను బస్సులకు ఓ నర్లను చేశామని మంత్రి సీతక్క తెలిపారు. మండల సమాఖ్యలో ఉన్న మహిళల కోరికలు నెరవేరుతున్నాయని, మహిళలు ఆర్థి కంగా ఎదుగుతున్నారని పేర్కొన్నారు. ప్రభు త్వం ఏర్పడిన నాటి నుంచి రూ. 25 వేల కో ట్ల రుణాలను మహిళా సంఘాలు పొందాయని తెలిపారు.
స్వయం ఉపాధి నుంచి కొంతమందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగడం అందరికీ గర్వకారణమన్నారు. ప్రభు త్వం నిర్వహించే ప్రతి రంగంలోనూ మహిళలకు అవకాశం ఇస్తున్నామని, దీంతో మహి ళా సంఘాలు ముందడుగు వేస్తున్నాయని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు కూడా మహిళా సంఘాలు ఆర్థిక చేయూతనిస్తున్నాయని చెప్పారు.
మహాలక్ష్మీ పథకం వల్లనే ఆర్టీసీ బతికింది: మంత్రి పొన్నం
మహాలక్ష్మీ పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్లనే ఆర్టీసీ మరోసారి బతికిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. త్వరలోనే దాదాపు 200 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేసిన రికార్డు నమోదు కాబోతుందన్నారు. రూ. 6,500 కోట్ల విలువైన ఉచిత ప్రయా ణం నమోదు కాబోతుందని, ఈ డబ్బులు ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించిందన్నారు.
ఆర్టీసీ నష్టాల నుంచి లాభాల్లోకి పోతుందన్నారు. జంట నగరాల్లో 5 వేల ఈవీ ఆటోల అనుమతి మహిళలకే కేటాయిస్తామని, వారికి శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తామని స్పష్టం చేశా రు. ఆర్టీసీ పరిరక్షణ, కార్మికుల సంక్షేమం, ప్రయాణీకుల భద్రత లక్ష్యంగా ముందుకు పోతున్నామని తెలిపారు. ప్రతి గ్రామంలో స్టీల్ బ్యాంక్ ఏర్పాటు చేస్తున్నామని, ఇందు లో అన్ని రకాల వస్తువులు లభిస్తాయని పేర్కొన్నారు. త్వరలోనే పూర్తిస్థాయిలో దీనిని ప్రారంభిస్తామని స్పష్టం చేశారు.