13 July, 2026 | 9:39 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

ఆర్‌ఎస్‌ఎస్ పాటల వీడియోలను విడుదల చేసిన కేంద్ర మంత్రి బండి

28-03-2026 12:00 AM

కరీంనగర్, మార్చి 27 (విజయక్రాంతి): రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్  శత వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తాను స్వయంగా పాడిన పాటల వీడియోలను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ విడుదల చేశారు. శుక్రవారం కరీంనగర్ శ్రీ మహాశక్తి ఆలయ ఆవరణలో   పాటల వీడియోలను విడుదల చేశారు. బండి సంజయ్ గీతాలకు వందేమాతరం శ్రీనివాస్ సంగీతం సమకూర్చారు. ఈ కార్యక్రమంలో రచయిత ఆకుల నాగేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.

పెట్రోలు, డీజిల్‌పై ఎక్సయిజ్ సుంకం తగ్గింపు హర్షణీయం..

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్

కరీంనగర్, మార్చి 27 (విజయక్రాంతి) : కేంద్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిల్ పై ఎక్సయిజ్ సుంకం తగ్గింపు హర్షణీయమని కేంద్ర హోంశాఖ సహాయ  మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి తెలంగాణ ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలుపుతున్నామని పేర్కొన్నారు. సంక్షోభ సమయంలో పెట్రోలు, డీజిల్ పై పన్నులు తగ్గించడం చారిత్రక నిర్ణయమని తెలిపారు. ప్రజా సంక్షేమ నిర్ణయాలు తీసుకోవడంలో ఎన్ డి ఏ ప్రభుత్వం అగ్రభాగాన ఉంటుందనడానికి తాజా నిర్ణయమే నిదర్శనమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా పెట్రోలు, డీజిల్ పై వ్యాట్ తగ్గించాలన్నారు. ప్రజలకు పెట్రోల్, డీజిల్ ధరలను మరింతగా అందుబాటులోకి తేవాలన్నారు. చమురు ధరలు తగ్గిస్తే సంక్షోభ సమయంలో నిత్యావసర వస్తువులు ప్రజలకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. తెలంగాణ ప్రజల మేలు కోసం ముఖ్య మంత్రి రేవంత్ రెడ్ది పెట్రోలు, డీజిల్ పై వ్యాట్ తగ్గించాలని బండి సంజయ్ కుమార్ కోరారు.