బిజినేపల్లిలో విషాదం.. ఈతకు వెళ్లి ఇద్దరు పిల్లలు మృతి
28-05-2024 04:29 PM
బిజినేపల్లి: నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. నీటికుంటలో ఈతకు వెళ్లి ఇద్దరు పిల్లలు మృత్యువాతపడ్డారు. మరోక బాలుడిని స్థానికులు కాపాడినట్లు సమాచారం. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను నాగర్ కర్నూల్ జనరల్ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతుల్లో ఒకరిని జడ్చర్లకు చెందిన మొహమ్మద్ మతిన్ గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తుచేస్తున్నారు.






