07-10-2024 01:58:22 AM
ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ కేంద్రం
హైదరాబాద్, అక్టోబర్ 6(విజయక్రాంతి): రాష్ట్రంలో రెండు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం వద్ద సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఆవర్తనం కొనసాగుతున్నదని ఐఎండీ పేర్కొంది. అలాగే, ఆగ్నేయ అరేబియా సముద్రం నుంచి కేరళ, దక్షిణ కర్ణాటక మీదుగా మరో ఆవర్తనం ఏర్పడిందని వెల్లడించింది.
ఈ రెండు ద్రోణుల ప్రభావంతో రాష్ట్రంలో రెండు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ వివరించింది. ఈ మేరకు వర్ష సూచన ఉన్న జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలో వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది