07-10-2024 01:57:35 AM
మాజీమంత్రి హరీశ్‌రావు
హైదరాబాద్, అక్టోబర్ 6 (విజయక్రాంతి): గతేడాది దసరా సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను నమ్మి తమ భవిష్యత్తు కోసం కాంగ్రెస్‌కు ఓటు వేయాలని గ్రామాల్లో ప్రచారం చేసిన యువత.. ఒకసారి ఆలోచించాలని మాజీమంత్రి హరీశ్‌రావు సూచించారు. ఆదివారం ఆయన ఎక్స్‌వేదికగా స్పందిస్తూ గ్యారెంటీలు అమలు చేయకపోగా, ఊళ్లలో అవ్వాతాతలకు పెంచుతామన్న పింఛన్ పెంచలేదని, రుణమాఫీ పూర్తి చేయలేదన్నారు.
రైతు బంధును నిలిపేశారని, రైతు భరోసా జాడ లేకుండా పోయిందన్నారు. బోనస్‌ను బోగస్ చేశారని విరుచుకపడ్డారు. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైందని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చి పది నెలలు పూర్తునా నాలుగు వేల నిరుద్యోగ భృతికి నీళ్లు వదిలారని పేర్కొన్నారు.
దసరాకు ఊళ్లకు వెళ్లినప్పుడు కుటుంబ సభ్యులు, స్నేహితులతో అలాయ్, బలాయ్ తీసుకుంటూ కాంగ్రెస్ చేసిన మోసాలను వివరించాలన్నారు. తమ ప్రాంతాల్లోని కాంగ్రెస్ నాయకులకు ఆరు గ్యారెంటీలతో పాటు రైతు డిక్లరేషన్, యూత్, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ డిక్లరేషన్‌లపై ఎక్కడిక్కడ నిలదీయాలని పిలుపునిచ్చారు.