27-05-2025 12:00:00 AM
నిర్మల్, మే 26( విజయక్రాంతి): నిర్మల్ జిల్లా బాసర గోదావరి వద్ద సోమవారం విషాదం చోటుచేసుకుంది. సరస్వతి మాత ను దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు గోదావరిలో స్నానం చేస్తున్న గా ఇద్దరూ నీటిలో మునిగి మృతి చెందినట్లు బాసర పోలీసులు తెలిపారు. మహారాష్ట్రలోని పర్భ ని జిల్లా టాకిలి గ్రామం చెందిన బాల సా హెబ్ దేశ్ముఖ్(11), నిజామాబాద్ జిల్లా కమలాపూర్ కు చెందిన మల్ల రాజు(40) అనే ఇద్దరు భక్తులు పుష్కర ఘాట్‌ల వద్ద స్నానా లు చేస్తుండగా నీటిలోతు తెలియక లోనికి వెళ్లి గల్లతయ్యారు.
కుటుంబ సభ్యులు కేకలు అరుపులు వేయడంతో పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు గజ ఈత గాళ్లు అక్కడికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టగా ఇద్దరి మృతదేహాలు బయటకు తీసుకువచ్చారు.
అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన ఇద్దరు భక్తులు అనుకోని ప్రమాదంలో మృతి చెందడంతో బాసర గోదావరి వద్ద కుటుంబ సభ్యుల రోజులలో దద్దరిల్లింది. బాసరలో గోదావరి నదిలోకి స్నానం చేయడానికి వెళుతున్న భక్తులు లోనికి వెళ్లకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టకపోవడం వల్లనే ఈ ప్రమా దం జరిగిందని మృతుని బంధువులు పేర్కొన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.