calender_icon.png 9 July, 2025 | 4:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంగీత సాహిత్యాలకు ఊపిరి ప్రకృతి

26-05-2025 10:58:51 PM

సినీ సంగీత దర్శకుడు బీమ్స్ సిసి రోలియో..

మహబూబాబాద్ (విజయక్రాంతి): సంగీత సాహిత్యాలకు ఊపిరిగా ప్రకృతి నిలుస్తుందని సినీ సంగీత దర్శకుడు బీమ్స్ సిసి రోలియో(Film Music Director Bheems Ceciroleo) అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో లయన్స్ క్లబ్ నూతన కమిటీ పదవీ స్వీకార కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మహబూబాబాద్ ప్రాంతం, ఇక్కడి ప్రజల అన్నా తనకెంతో ఇష్టమని, ఇక్కడి సామాజిక పరిస్థితుల ప్రేరణతో తన పాటలు సంగీత నేపథ్యం ఉంటుందని చెప్పారు. ఇంతటి స్థాయికి తాను ఎదగడానికి ఇక్కడ లభించిన ప్రేరణ ప్రోత్సాహం ఎన్నటికీ మరువలేదని వెల్లడించారు. లయన్స్ క్లబ్ చేపడుతున్న సమాజ సేవా కార్యక్రమాలను అభినందించారు.

నూతన కమిటీ అధ్యక్షుడిగా డాక్టర్ భానోత్ వీరన్న, కార్యదర్శిగా పరకాల రవీందర్ రెడ్డి, కోశాధికారిగా కొండపల్లి కరుణాకర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ చాపల రంజిత్ రెడ్డి, నరహరి సుధాకర్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ డాక్టర్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి, డాక్టర్ లక్ష్మీనరసింహారావు, రామ సహాయం వెంకట్ రెడ్డి, కొండపల్లి కేశవరావు, పరకాల శ్రీనివాస్ రెడ్డి, హనుమాండ్ల వెంకటేశ్వర్లు, డాక్టర్లు అర్జున్ రెడ్డి, దేవి రెడ్డి, అనిల్ గుప్తా, జగన్మోహన్రావు, నెహ్రు రాథోడ్, రాజ్ కుమార్, బొడ్ల మధుసూదన్ రావు, నవాబ్, సనాతన చారి, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.