calender_icon.png 9 July, 2025 | 5:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పార్ట్ టైం పరేషాన్

27-05-2025 12:00:00 AM

  1. సోషల్ వెల్ఫేర్ గురుకుల నోటిఫికేషన్ విడుదల 
  2. అయోమయంలో అధ్యాపకులు, ఉపాధ్యాయులు
  3. పాతవారినే కొనసాగించాలని డిమాండ్ 

కుమ్రం భీం ఆసిఫాబాద్, మే 26(విజయక్రాంతి): సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలలో తాత్కాలిక ప్రాతిపదికన పనిచేస్తున్న ఉపాధ్యాయులు, అధ్యాపకు లకు ప్రతి ఏటా సమస్య ఎదురవుతుంది. గురుకులాల్లో నాణ్యమైన విద్యను అందిస్తు న్న తాత్కాలిక ఉపాధ్యాయ అధ్యాపకులను రెన్యువల్ చేయకుండా ప్రతి ఏడాది డెమోలో పేరిట వేధింపులకు సొసైటీ గురిచేస్తుంది.

గతంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలో డెమోలు నిర్వహించడంతోపాటు పాతవారినే కొనసాగించేలా సొసైటీ సెక్రటరీలు చర్యలు తీసుకున్నారు. కానీ దానికి భిన్నంగా ఈ ఏడాది జోనల్ వ్యవస్థను తెరపైకి తీసుకురావడంతో జిల్లాలో పనిచేస్తున్న ఉపాధ్యాయ, అధ్యాపకులు వారి పరిస్థితి గందరగోళంలో పడింది.

గురుకులాల్లో దాదాపుగా 18 సంవత్సరాలుగా ఇలాంటి భద్రత లేకుండా పనిచేస్తున్నప్పటికీ ప్రతి ఏటా రెన్యువల్ పేరుతో ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు అధ్యాపకులు, ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రెగ్యులర్ సిబ్బందితో సమానంగా విధులు నిర్వహిస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నారు.పది, ఇంటర్ విద్యార్థుల ఉత్తమ ఫలి తాలకు వారి కృషి ఎంతగానో ఉంది. ఈ ఏడాది జిల్లాలో ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఐదు గురుకులాలలో 100% ఫలితాలు వచ్చాయి.

ఆందోళనలో ఉద్యోగులు..

జిల్లాలో ఐదు సాంఘిక సంక్షేమ గురుకు ల పాఠశాల కళాశాలలో దాదాపుగా 92 మంది తాత్కాలిక పద్ధతిన పిజిటి, టీజీటీ, జెఎల్ క్యాడర్‌లలో విధులు నిర్వహిస్తున్నా రు.ఇందులో 90 శాతంపైగా సిబ్బంది ఎన్నో ఏళ్లుగా గురుకులాలను నమ్ముకొని జీవనం గడుపుతున్నారు. రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా విధులు నిర్వహిస్తున్నారు.

గతం లో విధులు నిర్వహించిన వారిని ప్రతి ఏడా ది లాగే రెన్యువల్ చేయాలని తాత్కాలిక అధ్యాపక, ఉపాధ్యాయులు సంబంధిత అధికారులకు వినతి పత్రం అందజేశారు. పార్ట్ టైం ఉద్యోగులైనప్పటికీ స్టడీ డ్యూటీ, నైట్ డ్యూటీలు, హౌస్ మాస్టర్, హాలిడే డ్యూటీ, క్లాస్ టీచర్ ఇలా అనేక విధులు నిర్వహిస్తున్నారు.

పని భారం అధికంగా ఉన్నప్పటికీ విధులు నిర్వహిస్తున్న వారిని తొలగించేందు కు కొంతమంది ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్నారని, కొత్తవారిని నియమించేందుకు ఎత్తుకడలు వేస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. కొత్తవారిని నియమించేందుకు నోటిఫికేషన్ విడుదల చేసి సంబంధిత అధికారులకు అనుకూలమైన వారిని విధుల్లోకి తీసుకునే కుట్రలు జరుగుతున్నట్లు ఆరోపణ లు వెలువెత్తుతున్నాయి. 

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే: శ్రీనివాసరావు, డీసీఓ 

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకులాలలో తాత్కాలిక పద్ధతిన పిజిటి, పిజిటి ,జేఎల్ నియామకాలకు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటివరకు పాతవారిని కొనసా గించాలని ఇలాంటి ఉత్తర్వులు అందలేదు. అభ్యర్థుల మెరిట్ ఆధారంగా నియామకాలు చేపడతాం.

రెన్యువల్ చేయాలి

సాంఘిక సంక్షేమ గురుకుల, పాఠశాల కళాశాలలో పార్ట్ టైం పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న వారిని ప్రతి సంవత్సరం లాగే రెన్యువల్ చేయాలి. జిల్లాలో నీ గురుకుల పాఠశాలలో అధ్యాపక, ఉపాధ్యాయుల పోస్టులకు అధికారులు పేపర్ నోటిఫికేషన్ ఇవ్వడం ద్వారా తమకు అన్యాయం జరుగుతుంది.

పాతవారిని మినహాయిం చి కొత్తవారిని తీసుకోవాలి. ఎన్నో ఏళ్లుగా తమ విద్యార్థులకు నాణ్యమైన విద్యానందించడంతోపాటు ఉత్తమ ఫలితాలు సాధనకు కృషి చేస్తున్న. సొసైటీ అధికారులు పునర్ ఆలోచించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నాం. 
 మేకర్తి కృష్ణ, పార్ట్ టైం టీచర్స్ అండ్ లెక్చరర్స్ అసోసియేషన్ స్టేట్ కోఆర్డినేటర్