ఇద్దరు డాక్యుమెంట్ రైటర్ల అరెస్టు
02-07-2026 02:06 AM
పెద్దపల్లి, జూలై 1 (విజయక్రాంతి): పెద్దపల్లిలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు చేపట్టిన చర్యలు కలకలం రేపాయి. లంచం వ్యవహారానికి సంబంధించి ఇద్దరు డాక్యుమెంట్ రైటర్లను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఏసీబీ అధికారులు అందిన సమాచారంపై విచారణ చేపట్టి, కేసుకు సంబంధించిన ఆధారాలను సేకరించిన అనంతరం ఇద్దరు డాక్యుమెంట్ రైటర్లను అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు సమాచారం. వారిని విచారించి తదుపరి న్యాయపరమైన చర్యలు చేపడుతున్నారు.






