కమాన్‌పూర్ ఎమ్మార్వో ఆఫీస్‌ను పరిశీలించిన కలెక్టర్ శ్రీహర్ష
02-07-2026 02:05 AM
కమాన్పూర్, జూలై 1 (విజయ క్రాంతి): మాన్పూర్ మండలంలోని నూతన తహసీల్దార్ కార్యాలయ భవనాన్ని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పరిశీలించి, మిగిలిన రీనోవేషన్తో పాటు తుదిదశ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
కార్యాలయ భవనం నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించిన కలెక్టర్, అన్ని పనులను నాణ్యత ప్రమాణాలతో త్వరితగతిన పూర్తి చేసి, కార్యాలయాన్ని త్వరలో ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని సూచించారు. ప్రజలకు మెరుగైన రెవెన్యూ సేవలు అందించేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలని తెలిపారు. ఈ పర్యటనలో మంథని రెవెన్యూ డివిజన్ అధికారి సురేష్, మంథని తహసీల్దార్ అరిఫోద్దిన్, మంథని మున్సిపల్ కమిషనర్ మనోహర్, కమాన్పూర్ తహసీల్దార్ వాసంతి, ఏఈ జగదీష్తో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.






