calender_icon.png 14 August, 2025 | 4:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముగ్గురు ఉపాధ్యాయులకు ఇద్దరు డుమ్మా..

14-08-2025 12:14:18 AM

ఏడు తరగతులకు ఒక్కరే బోధన

నాగల్ గిద్ద,ఆగస్టు 13 :  ముగ్గురు ఉన్న పాఠశాలలో ఇద్దరు డుమ్మా కొట్టడంతో ఒకే ఉపాధ్యాయుడు పాఠాలు బోధించిన ఉదంతం నాగల్గిద్ద మండలం మావినెల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో నెలకొంది. బుధవారం ఉదయం విజయక్రాంతి వెళ్ళి పరిశీలించగా పాఠశాలలో ఒకే ఉపాధ్యాయుడు ఒకటి నుంచి 7వ తరగతి విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ కనిపించారు. గైర్హాజరైన ఇద్దరు ఉపాధ్యాయులు భార్యాభర్తలు కావడం గమనార్హం.

ఈ పాఠశాలలో ఐదు తరగతి గదులు ఉండగా కేవలం 17 మంది మాత్రమే విద్యార్థులు ఉన్నారు. ప్రభుత్వం ఓవైపు విద్యార్థుల సంఖ్య పెంచాలని చూస్తున్నా ఇక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయులు విధులకు డుమ్మాలు కొడుతూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

ఉపాధ్యాయుల గైర్హాజరుపై స్థానిక కాంప్లెక్స్ హెచ్‌ఎం శంకర్ను వివరణ కోరగా తనకు సమాచారం లేదని, వివరాలు తెలుసుకొని గైర్హాజరైన  ఉపాధ్యాయులపై విచారణ చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు.