calender_icon.png 15 August, 2025 | 4:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తం

14-08-2025 12:15:44 AM

జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

మెదక్, ఆగస్టు 13(విజయక్రాంతి): జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు ముందస్తుగానే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేపట్టాల్సిన సహాయక చర్యలు, అప్రమత్తతతో కూడిన సన్నద్ధతపై ఆయా శాఖల వారీగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ దిశానిర్దేశం చేశారు. భారీ వర్ష సూచనల నేపథ్యంలో ఎలాంటి అత్యవసర పరిస్థితులు తలెత్తినా, సమర్ధవంతంగా ఎదుర్కొనేలా అన్ని విధాలుగా సన్నద్ధం అయి ఉన్నామన్నారు.

క్షేత్ర స్థాయిలో కార్యదర్శి నుండి జిల్లా స్థాయి అధికారి వరకు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.  అత్యవసర పరిస్థితుల దృష్ట్యా ఉద్యోగుల సెలవులు రద్దు చేశామన్నారు. తన అనుమతి లేకుండా కార్యస్థానం విడిచి వెళ్ళొద్దని స్పష్టం చేశారు. పశువులను ఆరుబయట మేతకు వదలకుండా ఇంటి పట్టునే వరద చేరని ప్రాంతాల్లో సురక్షితంగా ఉంచాలని సూచించారు.

అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటకు రావొద్దని, ఏ సమయంలో కుండపోత వర్షం పడుతుందో తెలీదని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జాలర్లు చేపల వేటకు వెళ్ళొద్దని తెలిపారు. పొంగి పొర్లుతున్న వాగులు దాటకుండా పటిష్ట బందోబస్తు, బారికేడ్లు ఏర్పాటు చేసేలా పటిష్ట చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు.