calender_icon.png 14 August, 2025 | 2:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ ఆఫీసుల్లో సిటిజన్ చార్ట్ తప్పనిసరి

14-08-2025 12:11:52 AM

- పాలనలో పారదర్శకత కోసమే సమాచార హక్కు చట్టం

- రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ డా.చంద్రశేఖర్‌రెడ్డి

నిర్మల్, ఆగస్టు ౧౩ (విజయక్రాంతి): పాలనలో పారదర్శకత కోసమే సమాచార హక్కు చట్టాన్ని తెచ్చారని, ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో సిటిజన్ చార్ట్‌ను తప్పనిసరిగా ప్రద ర్శించాలని రాష్ట్ర చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ డా. చంద్రశేఖర్ రెడ్డి అధికారులకు సూచించారు.

బుధవారం కలెక్టరేట్ సమావేశ మం దిరంలో సమాచార హక్కు చట్టంపై రాష్ట్ర సమాచార కమిషనర్ ఆధ్వర్యంలో పీఐవో అధికారులకు నిర్వహించిన అవగాహన సదస్సులో సమాచార కమిషనర్లు పర్వీన్, భూపా ల్, కలెక్టర్ అభిలాష అభినవ్‌లతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా  రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ మాట్లాడుతూ, సమాచార హక్కు చట్టం పౌరులకు పారదర్శకత, బాధ్యతాయుత పరిపాలన అందించడం లో కీలకమైన సాధనమని తెలిపారు.

ఆర్టీఐ దరఖాస్తులు, ఫిర్యాదులు తక్కువ అందిన జిల్లాల్లో నిర్మల్ ఓకటన్నారు. పీఐవో అధికారులు ప్రజలకు సమయానికి, పూర్తి సమాచా రాన్ని అందించాలి అని సూచించారు. ఆర్టీఐ దరఖాస్తుల పరిష్కారం ఆలస్యం కాకుండా, చట్టంలో ఉన్న సమయపరిమితి లోపల సమాధానమివ్వాలని ఆదేశించారు. సమాచారాన్ని దాచిపెట్టడం, తప్పుడు సమాచారం ఇవ్వడం వంటి చర్యలు చట్టవిరుద్ధమని హెచ్చరించారు.

ఆర్టీఐ చట్టాన్ని సక్రమంగా అమలు చేస్తే అవినీతి తగ్గిపోతుందని, ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం పెరుగుతుందని అన్నారు. ప్రభుత్వ శాఖలు పారదర్శకత, జవాబుదారీతనంతో పనిచేయాలని సూచించారు.  కలెక్టర్ మాట్లాడుతూ, సమాచార హక్కు చట్టంపై ప్రతి ఒక్క అధికారి అవగాహన పెంచుకోవాలన్నారు. నిర్మల్ జిల్లాలో ఆర్టీఐ అప్పీల్ కేసులను కలెక్టరేట్లో కమిషన్ ప్రత్యేకంగా పరిష్కారానికి చర్యలు చేపట్టింద న్నారు.

జిల్లాలోని అన్ని పీఐవో అధికారులు చట్టపరమైన నిబంధనలను పూర్తిగా అనుసరించాలి అని పేర్కొన్నారు. రాష్ట్ర సమాచార కమిషన్ కమిషనర్లు పర్వీన్, భూపాల్ మాట్లాడుతూ, ఆర్టీఐ చట్టం సక్రమంగా అమలు చేయాల్సిన బాధ్యత పీఐవో, ఏపీఐవోలదేనన్నారు. కమిషన్ ఏర్పాటు తర్వాత 18 వేల కేసుల్లో 2300కుపైగా పరిష్కరిం చామన్నా రు. అనంతరం స.హ. చట్టంపై సందేహాలను నివృత్తి చేశారు.

సదస్సులో పీఐవో అధికారులకు సమాచార హక్కు చట్టం నిబంధనలు, దరఖాస్తుల పరిష్కార విధానం, అప్పీల్ ప్రక్రియపై పవర్ పెయింట్ ప్రజెంటేషన్ ద్వారా క్లుప్తంగా వివరించారు. అనంతరం కమిషనర్లను జ్ఞాపికల తో కలెక్టర్, అధికారులు సత్కరించారు. సమావేశానికి ముందు కలెక్టరేట్ ప్రాంగణంలో కమిషనర్లు, కలెక్టర్ మొక్కలు నాటి నీరుపోశారు.

సదస్సు అనంతరం, రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ ఆధ్వర్యంలో వివిధ సమాచార హక్కు దరఖాస్తులు, అప్పీల్ ఇయరింగ్ (విచారణ) నిర్వహించారు. సంబంధిత పీఐవో అధికారులు, దరఖాస్తుదారుల నుండి వివరాలు స్వీకరించి తగిన ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, బైంసా సబ్ కలెక్టర్ సంకేత్ కుమార్, ఆర్డీఓ రత్నకల్యాణి, వివిధ శాఖల అధికారులు, పిఐఓ లు, ఎపిఐఓలు, తదితరులు పాల్గొన్నారు.