2 July, 2026 | 5:36 AM

235 గిగావాట్లకు విద్యుత్ డిమాండ్

24-05-2024 12:05 AM

న్యూఢిల్లీ, మే 23: అధిక ఉష్ణోగ్రతలతో అల్లాడుతున్న భారత్‌లో విద్యుత్ డిమాండ్ బుధవారం పీక్ స్థాయిలో 235.06 గిగావాట్లు నమోదయ్యింది. దేశంలోని పలు ప్రాంతా ల్లో వేడి సెగల కారణంగా ఎయిర్ కండీషనర్లు, కూలర్ల వాడకం విపరీతంగా పెరగడం భారీ విద్యుత్ డిమాండ్‌కు దారితీసిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. విద్యుత్ మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం మే 22న 235.06 గిగావాట్ల విద్యుత్ సరఫరా జరిగింది. ఈ వేసవి సీజన్లో ఇదే గరిష్ఠం. 2023 సెప్టెంబర్‌లో 243.27 గిగావాట్ల డిమాండ్ ఇప్పటివరకూ రికార్డు. ఈ వేసవిలో ఆ రికార్డు చెదిరిపోవచ్చని భావిస్తున్నా రు. ఈ సీజన్లో 260 గిగావాట్లకు పీక్ డిమాండ్ చేరవచ్చని విద్యుత్ శాఖ అంచనా వేస్తున్నది.