30 August, 2026 | 10:58 AM

Breaking News

10కే పరుగుకు ఐటీ కారిడార్‌ బలి!   •   అడ్లూరి శ్రీనివాస్‌ను పరామర్శించిన డీఐసీ తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్   •   అభివృద్ధి పనులను పరిశీలించిన ఎంపీ వేం నరేందర్ రెడ్డి   •   ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కల్పించాలి: అదనపు కలెక్టర్ చంద్రయ్య   •   సత్తుపల్లిలో న్యూ జెనెసిస్ హాస్పిటల్ ప్రారంభించిన మంత్రి తుమ్మల   •   నేపాల్-టిబెట్ వరదల్లో ఇప్పటివరకు 682 మంది మృతి   •   చెరువులో అనుమానాస్పదంగా చేపల మృతి   •   పాలేరు జలాశయాన్ని పరిశీలించిన ఎస్ఈ   •   రీ-సర్వే ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్ కుమార్ దీపక్   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని మహిళకు తీవ్రగాయాలు   •  

గో డిజిట్ ఫ్లాట్ లిస్టింగ్

24-05-2024 12:05 AM

ముంబై, మే 23: స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి, ఆయన సతీమణి, సినీనటి అనుష్క శర్మలకు పెట్టుబడులు ఉన్న డిజిటల్ ఇన్సూరెన్స్ కంపెనీ గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ షేర్లు గురువారం స్టాక్ ఎక్సేంజీల్లో ఫ్లాట్ గా లిస్టయ్యాయి. ఐపీవోను షేరుకు రూ.272 ధరతో జారీచేయగా, ఎన్‌ఎస్‌ఈలో ఇది రూ.280 వద్ద లిస్ట య్యింది. ఇంట్రాడేలో రూ.314 వర కూ పెరిగిన ఈ షేరు చివరకు రూ.305 వద్ద ముగిసింది. లిస్టింగ్ ధరతో పోలిస్తే ముగింపులో గో డిజి ట్ ఐపీవో ఇన్వెస్టర్లకు 6 శాతంపైగా లాభాలను తెచ్చిపెట్టింది.  ఈ కంపెనీ జారీచేసిన ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) 10 రెట్లు ఓవర్ సబ్‌స్క్రయిబ్ అయ్యింది.