2 July, 2026 | 2:29 AM

కారును అడ్డగించి, బెదిరింపులకు పాల్పడిన ఇద్దరు వ్యక్తులకు రిమాండ్

02-07-2026 12:49 AM

ఘట్‌కేసర్, జూలై 1 (విజయక్రాంతి): కారును అడ్డగించి, బెదిరింపులకు పాల్పడిన ఇద్దరు వ్యక్తులను ఘట్ కేసర్ పోలీసులు బుధవారం అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సైదాబాద్కు చెందిన పోడు సాయికుమార్ ఈనెల 21వ తేదీన సాయంత్రం తన కుటుంబ సభ్యులతో కలిసి వరంగల్ నుండి హైదరాబాద్కు తన హోండా అమేజ్ కారులో వస్తుండగా రాత్రి 7:30 గంటల ప్రాంతంలో మార్గమధ్యలో అవుషాపూర్ దగ్గరకు రాగానే ఒక పల్సర్ ఎన్‌ఎస్ 160 బైక్ టిఎస్ 30కె 3503 పై మద్యం మత్తులో ఉన్న ఇద్దరు వ్యక్తులు ప్రమాదకరంగా నిర్లక్ష్యంగా బైక్ నడుపుతూ ఇతరులు దారి ఇవ్వకుండా వెళుతుండగా సాయి తన కారు హారన్ కొట్టగా దానితో కోపోద్రేకులైన యువకులు ఘట్ కేసర్ అవుషాపూర్ నుంచి యంనంపేట్  చౌరస్తా వరకు వెంబడించి కారులో ఉన్నటువంటి కుటుంబ సభ్యులను  భయభ్రాంతులకు గురిచేసి, వారి యొక్క కారును చేతులతో కొట్టినారు.

ఇట్టి సంఘటన పై సాయికుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు లో భాగంగా నేరము చేసినటు వంటి ఇద్దరు వ్యక్తులను సీసీటీవీ ఆధారంగా గుర్తించి, వారిని అరెస్ట్ చేసి వారి నుంచి పల్సర్ బైక్ సీజ్ చేయడమైనది. ఇద్దరు నిందితులు రంగ శివ (21), అడిగే అఖిల్ (20) లను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించి కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ బాలస్వామి తెలిపారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే చర్యలకు ఎవరు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకొనబడుతుందన్నారు.