16-07-2025 01:07:34 AM
సూర్యాపేట, జూలై 15 (విజయక్రాంతి) : జిల్లా కేంద్రంలో ని మన అమ్మ దవాఖానాలో రెండు అవదైనా శాస్త్ర చికిత్సలు జరిగినట్లు వైద్యాధికారులు సుధీర్, సుప్రజలు మంగళవారం విలేకరులకు తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం యండ్లపల్లి గ్రామానికి చెందిన లక్ష్మమ్మ అనే మహిళ గత కొన్ని సంవత్సరాలుగా కాలికి వేరికోస్ అల్సర్ తో బాధపడుతున్నారు.
దీంతో మన అమ్మ హాస్పిటల్ లో సంప్రదించగా అపోలో హాస్పిటల్ డాక్టర్ అజయ్ వాస్క్యూలర్ సర్జన్ సూర్యాపేటలోనే మొట్టమొదటిసారిగా కోతల్లేకుండా , బ్లీడింగ్ కాకుండా లేజర్ అబ్లేషన్ పద్ధతిలో శస్త్రచికిత్స నిర్వహించినట్లు తెలిపారు. పేషెంట్ మొదటిరోజే తిరిగి సాధారణ స్థితిలో నడిచినట్లు తెలిపారు. అలాగే చిన్నతనం నుండి నాలుక అతుక్కుని ఉన్నటువంటి మరో మహిళకి లేజర్ చికిత్స ద్వారా మన అమ్మ డెంటల్ హాస్పిటల్ లో డాక్టర్ రుక్మిణి చిత్ర, డాక్టర్ వినయ్ లు విజయవంతంగా సర్జరీ చేశారన్నారు. కాగా మొదటిసారి అరుదైన రెండు చికిత్సలు విజయవంతంగా చేయడంతో వైద్యాధికారులను పలువురు అభినందించారు.