calender_icon.png 16 July, 2025 | 8:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సందడిగా టీసీఈఐ ఈవెంట్ ఎక్స్‌లెన్స్ అవార్డ్స్

16-07-2025 01:06:53 AM

మణికొండ, జూలై 15 : తెలంగాణ ఛాంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇండస్ట్రీ (టీసీఈఐ) ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి  టీసీఈఐ ఈవెంట్ ఎక్స్ లెన్స్ అవారడ్స్ 2025  ప్రదానోత్సవ కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు.

నగరంలోని గండి పేట, ఉస్మాన్ సాగర్ రోడ్లో ఉన్న సవాయ కన్వెన్ష్  లో  ‘డిజైన్ బై రాజా  టీసీఈఐ ఈవెంట్ ఎక్సలెన్స్ అవారడ్స్ కార్యక్రమంలో  తెలంగాణ సహా దేశవ్యాప్తంగా పలువురికి 4 ప్రధాన విభాగాలతో పాటు విభిన్న విభాగాలలో 100కు పైగా అవార్డులను అందించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి  జయేష్ రంజన్,  తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పటేల్ రమేష్‌రెడ్డి హాజరయ్యారు.  టీసీఈఐ అధ్యక్షుడు బలరాం బాబు, ప్రధాన కార్యదర్శి రవి బురా, ఎక్సలెన్స్ అవారడ్స్ కన్వీనర్ రమేష్ కే. ముప్పన, కో కన్వీనర్లు సుధాకర్ యెరాబాది, హిరేష్ రెడ్డి, టీసీఈఐ వర్కింగ్ కమిటీ ముఖ్య అతిథులతో కలిసి అవార్డులు అందజేశారు.

వీరిలో స్వస్తిక్ సప్లైయింగ్ కంపెనీకి చెందిన అనిల్ కుమార్ లకోటియా, క్యాట్ప్రో ఈవెంట్స్ అండ్ ఎంటర్టై మెంట్ లిమిటెడ్కు చెందిన పింగళి విద్యాసాగర్, ఎ టు జెడ్ ఫంక్షన్ ఆర్గనైజర్స్కు చెందిన ఎండీ మక్సూద్ అలీ, మొఘల్ క్యాటరర్స్కు చెందిన మోయిన్ ఖాన్,  క్లాసిక్ 3 గ్రూప్న కు చెందిన కిషన్ అగర్వాల్ ఉన్నారు.

తెలంగాణలో ఈవెంట్ రంగ వృద్ధికి  ఎంతో కృషి చేసిన  ది నామ్ధారి బిజినెస్ గ్రూప్కు చెందిన సూరత్ సింగ్ మల్హోత్రా, మ్యూజికల్ వేవ్స్ నుంచి కొమ్ము ఆదర్శ్ కుమార్ జీవిత సాఫల్య పురస్కారాలను ప్రధానం చేశారు.