04-09-2025 04:46:49 PM
మరమ్మత్తులు చేయించడంలో నిర్లక్ష్యం
హనుమకొండ (విజయక్రాంతి): హనుమకొండ జిల్లా పరిషత్ కార్యాలయం(Zilla Parishad Office)లో లక్షల విలువచేసే కలప ఫర్నిచర్ మరమ్మత్తులకు నోచుకోక మూలన పడేశారు. కుర్చీలు, టేబుల్స్, బీరువాలు నిర్లక్ష్యంగా జిల్లా పరిషత్ కార్యాలయ అధికారులు మరమ్మత్తులు చేయించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీనితో లక్షల రూపాయల విలువ చేసే ఫర్నిచర్ నిరుపయోగంగా మూలన పడేశారు. రాష్ట్రాలు విడిపోయిన అనంతరం వరంగల్, హనుమకొండ జిల్లాల పరిషత్ కార్యాలయాలుగా విభజించారు. ఆధునికత ఫర్నిచర్ కొనుగోలు పేరిట లక్షల రూపాయల ఖర్చులు చేశారు. కలప ఫర్నిచర్ ఉపయోగం ఉంచుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నరని ఆరోపణలు ఉన్నాయి. క్రింది స్థాయి ఉద్యోగులు కలప ఫర్నిచర్ ను దొంగలిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికైనా జిల్లా పరిషత్ కార్యాలయ అధికారులు దృష్టి సారించి కలప ఫర్నిచర్ మరమ్మత్తులను చేయించుకొని ఉపయోగించుకోవాలని పలువురు ప్రజాప్రతినిధులు ఉద్యోగులు కోరుతున్నారు.