calender_icon.png 7 September, 2025 | 1:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉద్యోగులకు పదవి విరమణ సహజమే..

04-09-2025 04:37:02 PM

నస్రుల్లాబాద్ తహసిల్దార్ సువర్ణ..

బాన్సువాడ (విజయక్రాంతి): ఉద్యోగరీత పదవి బాధ్యతలు చేపట్టి పదవి విరమణ పొందడం ఉద్యోగులకు సహజమేనని నస్రుల్లాబాద్ తహసిల్దార్ సువర్ణ(Tehsildar Suvarna) అన్నారు. కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ మండల కేంద్రంలో ఐసిడిఎస్ గ్రేడ్ వన్ సూపర్వైజర్ యండమూరి వాణి పదవి విరమణ కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 28 సంవత్సరాలుగా అంగన్వాడి కార్యకర్త వృత్తిలో చేరి సూపర్వైజర్ గా పదవి విరమణ కావడంతో తోటీ ఉద్యోగులు ఆమె చేసిన సేవలను కొనియాడారు. అనంతరం వాణి మాట్లాడుతూ.. గతంలో అంగన్వాడి టీచర్ అంటే చులకనగా చూసేవవారని, కానీ నేడు గ్రామస్థాయిలో అంగన్వాడీ కార్యకర్త లేనిది ఏ పని  కాని పరిస్థితులు ఉన్నాయన్నారు. రూ. 175లతో అంగన్వాడి కార్యకర్తగా వృత్తిలో చేరి గ్రేడ్1 సూపర్ వైజర్గా రిటైర్డ్ కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ సువర్ణ, సిడిపిఓలు  సౌభాగ్య, కళావతి, నాగమణి బీర్కూర్ ఏఎంసీ చైర్మన్ శ్యామల, అంగన్వాడి సూపర్వైజర్ లు, టీచర్లు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.