calender_icon.png 27 January, 2026 | 3:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి

27-01-2026 12:00:00 AM

కరీంనగర్ క్రైమ్ జనవరి26 (విజయ క్రాంతి) కరీంనగర్ నగరంలోని మూడవ నగర పోలీస్ స్టేషన్ పరిధిలో హౌజింగ్ బోర్డు కాలనీ వద్ద సోమవారం జరిగిన ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందినట్లు త్రి టౌన్ సీఐ తిరుమల్ గౌడ్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం... కరీంనగర్ జిల్లా వీణవంక మండలం మామిడాపల్లి గ్రామానికి చెందిన మ్యాకల గణేష్ (22) తన ద్విచక్ర వాహనంపై తన స్నేహితుడైన మిర్యాల సందీప్ రెడ్డి (20)ని తీసుకొని తన ద్విచక్ర వాహనానికి సంబంధించిన సామాను తీసుక రావడానికి కరీంనగర్కు వచ్చారు.

బైక్కు సంబంధించిన సామాన్లు తీసుకొని తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో హౌజింగ్ బోర్డు వైపు రోడ్డు దాటుతుండగా అకస్మాత్తుగా వచ్చిన స్కూల్ బస్సు వచ్చి ఢీకొట్టగా ఇద్దరు యువకులు క్రింద పడడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. సదరు యువకులను 108 వాహనంలో ఆస్పత్రికి తరలించగా అప్పటికే సదరు యువకులు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని వెంటనే వెళ్లి సీఐ ప్రత్యేక్షంగా పరిశీలించారు. మృతుని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాపు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.