calender_icon.png 27 January, 2026 | 4:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రూ.600 కోట్లతో త్రిబుల్ ఐటీ కళాశాల నిర్మాణం

27-01-2026 12:00:00 AM

ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

జడ్చర్ల, జనవరి 26: జడ్చర్ల మున్సిపాలిటీలోని బాదేపల్లి జెడ్పిహెచ్‌ఎస్ బాలుర పాఠశాలలో నిర్వహించిన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుధ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి ఎన్సీసీ విద్యార్థుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గణతంత్ర దినోత్సవం వంటి పర్వదినాన ఈ పాఠశాలలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. జడ్చర్ల నియోజకవర్గానికి మంజూరైన ట్రీబుల్ ఐటీ కళాశాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయడం జరిగిందని,దాదాపు మూడు విడతలుగా రూ.600 కోట్ల వ్యయంతో ఈ కళాశాల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు.

ఈ కళాశాల మంజూరుకు మహబూబ్నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి సహకారం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఎంపీ డీకే అరుణ సహకారంతో జిల్లాకు నవోదయ పాఠశాల మంజూరు కాగా, దానిని జడ్చర్ల నియోజకవర్గంలోని పెద్దయిపల్లి సమీపంలో ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్’ను సుమారు రూ.200 కోట్ల వ్యయంతో విద్యార్థులకు అన్ని రకాల మౌలిక సదుపాయాలతో నిర్మించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కోనేటి పుష్పలత నర్సింహులు, ఎఎంసీ చైర్ పర్సన్ తంగేళ్ల జ్యోతి అల్వాల్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.