9 July, 2026 | 2:14 AM

యూఐ.. ఓ సైకలాజికల్ కల్కి

17-12-2024 12:00 AM

స్టార్ హీరో ఉపేంద్ర కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘యూఐ’. లహరి ఫిల్మ్స్, జీ మనోహరన్, వీనస్ ఎంటర్‌టైనర్స్ కేపీ శ్రీకాంత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ఈ చిత్రం తెలుగు హక్కులను సొంతం చేసుకున్నారు. సినిమా డిసెంబర్ 20న విడుదల కానున్న నేపథ్యంలో మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు డైరెక్టర్ బుచ్చిబాబు సాన, నిర్మాత ఎస్‌కేఎన్ అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉపేంద్ర మాట్లాడుతూ.. “ఇండియానే కాదు, వరల్డ్‌నే షేక్ చేస్తోంది టాలీవుడ్. తెలుగు ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. నేను 20 ఏళ్ల క్రితం చేసిన సినిమాల్ని ఇంకా గుర్తుపెట్టుకొని నన్ను ఇంత గొప్పగా ఆదరిస్తున్నారు. ‘యూఐ’ మూవీ రెగ్యులర్ ఫిల్మ్‌లాగా ఉండదు.. ఒక కొత్త అనుభూతి పొందుతారు. నా ధైర్యం ప్రేక్షకులే. మీరు మైథలాజికల్ ‘కల్కి’ చూశారు. ఇందులో సైకలాజికల్ ‘కల్కి’ చూస్తారు” అన్నారు. కార్యక్రమంలో హీరోయిన్ రేష్మ, నిర్మాత అంబికా రామచంద్రరావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లు తులసీరాం, చంద్రు మనోహరన్, కో ప్రొడ్యూసర్ నవీన్ మనోహరన్, చిత్రబృందం పాల్గొన్నారు.