‘ఉల్లాస్’ పరీక్షలు
ముకరంపుర, మార్చి 29 (విజయ క్రాంతి): జిల్లాలోని అన్ని మునిసిపాలిటీలలో ఉల్లాస్ కార్యక్రమం కింద స్వయం సహాయక సంఘాలకు చెందిన మొత్తం 13,647 మంది నిరక్షరాస్యులను గుర్తించారు. వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో ఆదివారం పరీక్షలు నిర్వహించారు. మొత్తం 5,344 మంది పరీక్షలు రాయగా, 89 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 221 సమాఖ్య ఆఫీ స్ బేరర్స్ను ఇన్విజిలేటర్లుగా నియమించి పరీక్షలను నిర్వహించారు.
మెప్మా పీడీ జి స్వరూప రా ణి నగరంలోని ప్రభుత్వ పాఠశాల హౌజింగ్ బో ర్డు కాలనీ, కార్ఖానగడ్డ, రామ్నగర్, సప్తగిరి కాలనీ పరీక్షా కేంద్రాలను సందర్శించి పరీక్షల నిర్వహణను పరిశీలించి, అవసరమైన సూచనలు అందించారు. పరీక్షల నిర్వహణలో వాలంటరీ టీచర్లు, కమ్యూనిటీ ఆర్గనైజర్లు, రిసోర్స్ పర్సన్స్, టౌన్ మిషన్ కోఆర్డినేటర్లు, తదితరులు పాల్గొన్నారు.




