3 July, 2026 | 9:27 PM

Breaking News

రామన్నపేటలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •   హెచ్‌పి గ్యాస్ ఏజెన్సీని ఆకస్మిక తనిఖీ చేసిన హెచ్‌పిసిఎల్ డిప్యూటీ జనరల్ మేనేజర్ కోమర శ్రీనివాసు   •   బదిలీపై వెళ్లిన ఇంచార్జ్ ఎంపీడీవోకు ఘన సన్మానం   •   ఆయిల్ పామ్ సాగుతో అద్భుత ఫలితాలు సాధిస్తున్న ప్రభాకర్ రెడ్డికి సన్మానం   •   వర్షపు ఇబ్బందుల్లో ఉన్న కుటుంబానికి టార్పాలిన్ అందించిన సర్పంచ్   •   స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) 2027 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి   •   ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవోత్సవం   •   పిచ్చిమొక్కల తొలగింపు   •   తాగారు.. దొరికారు..   •   కేజీబీవీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మండల ప్రత్యేక అధికారి   •  

అమ్మో.. ప‘రేషన్’

16-06-2025 02:12 AM
  1. రేషన్ బియ్యం కోసం ప్రజలు పడిగాపులు
  2. రాత్రి 9 గంటల వరకు క్యూలైన్లలో నిరీక్షణ 

కార్వాన్, జూన్ 15: రేషన్ బియ్యం కోసం లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో నానా ఇక్కట్లకు గురవుతున్నారు. రా త్రి 9 గంటల వరకు షాపుల వద్ద వందలాదిమంది మహిళలు పురుషులు లైన్లో నిల బడుతున్నారు. ప్రభుత్వం మూడు నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయడం.

ఈ విధంగా కొన్ని రోజులుగా సన్న బియ్యం సరఫరా చేయడంతో ప్రజలు రేషన్ తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. రేషన్ బియ్యం పంపిణీకి ఈనెల 30 వరకు గడువు ఉంది. కూడా ప్రతిరోజు వందలాదిమంది దుకాణాల వద్ద క్యూలైన్లో గంటలకొద్దీ పడిగాపులు  పడుతున్నారు.

- మూడుసార్లు తంబ్ పెట్టడంతో..

 ఒక్కో లబ్ధిదారులు మూడుసార్లు తంబు పెడుతూ ఉండటంతో ఆలస్యం అవుతుందని రేషన్ డీలర్లు చెబుతున్నారు. కార్వాన్ నియోజకవర్గంలోని జియాగూడ, కార్వాన్, లంగర్ హౌస్ , నానల్ నగర్ డివిజన్ తదితర ప్రాంతాల్లో రేషన్ లబ్ధిదారులు షాపుల వద్ద నిరీక్షిస్తున్నారు. కొన్నిసార్లు రేషన్ షాపుల్లోని సాంకేతిక సమస్య కూడా తలెత్తుతున్న ట్లు వినియోగదారులు చెబుతున్నారు. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం, జూన్ 3వ తేదీ వరకు రేషన్ సరుకులు తీసుకోవచ్చని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

- వదంతులు నమ్మొద్దు 

 రేషన్ బియ్యం త్వరలో నిలిపివేస్తారని వదంతులు వ్యాపించడంతో చాలామంది వినియోగదారులు షాపుల వద్దకు క్యూ కడుతున్నారు. ప్రజలు వదంతులను నమ్మ వద్దని, ఈ నెల 30 వరకు రేషన్ సరుకులు ఇస్తామని సివిల్ సప్లై అధికారులు స్పష్టం చేశారు.