3 July, 2026 | 10:23 PM

Breaking News

పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారని విద్యార్థి సంఘాల ఆందోళన   •   ఉప సర్పంచ్ కవిత కుటుంబానికి అండగా ఉంటాం   •   చివ్వెంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దారావత్ వీరన్న నాయక్   •   డీఏపీ ఎరువుల ధరలు ఎమ్మార్పి ధరకు ఇవ్వాలి   •   ఎర్రుపాలెం శివాలయంలో శృంగేరి శారద పీఠాధిపతి ప్రత్యేక పూజలు   •   ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే   •   ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •   రామన్నపేటలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •  

విద్యుత్ ఆర్టిజన్ల సమస్యలపై 18న చలో హైదరాబాద్

16-06-2025 02:14 AM

రాష్ట్ర ప్రధానకార్యదర్శి స్వామి పిలుపు

మహబూబాబాద్, జూన్ 15 (విజయక్రాంతి): విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 18న ఇందిరాపార్క్ వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయాలని రాష్ట్ర జేఏసీ ప్రధాన కార్యదర్శి ఎన్.స్వామి పిలుపునిచ్చారు. మహబూబాబాద్ లో ఆదివారం ఎండి ఖదీర్ అధ్యక్షతన జరిగిన సిఐటియు అనుబంధ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ సర్కిల్ స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.

ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ విద్యుత్ సంస్థల్లో  పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులకు విద్యార్హతలను బట్టి కన్వర్షన్ చేయాలని కోరారు.  వీరి సమస్యల పరిష్కారం కోసం అనేక రోజులుగా పోరాటాలు చేస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదన్నారు. యాజమాన్యంలో కదలిక కోసం ఈ నెల 18న ఇందిరాపార్క్ వద్ద కుటుంబ సభ్యులతో కలిసి భారీ ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ధర్నాలు మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ కే.నాగేశ్వర్, ప్రొఫెసర్ జి. హరగోపాల్ పాల్గొంటారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.ప్రసాద్, సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆకుల రాజు, కుంటా ఉపేందర్, తెలంగాణ ఎన్పీడీసీఎల్ కంపెనీ కార్యదర్శి బి.వెంకట రాజు, కొత్తగూడెం రీజినల్ అధ్యక్షులు కే.శ్రీనివాస్, కొత్తగూడెం జిల్లా గౌరవ అధ్యక్షులు రమేష్, స్థానిక నాయకులు నీలం శ్రీనివాస్, పిల్లి వెంకటేశ్వర్లు, వీరభద్రం, అక్కినపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.