29 March, 2026 | 1:35 AM

అంపైర్ రాజేందర్

29-03-2026 12:00 AM

పల్లె నుంచి ప్రపంచ స్థాయికి

పట్టుదల ఉంటే.. సాధించలేనిది ఏదీ లేద ని మరోసారి నిరూపించాడు వరంగల్ జిల్లా నెక్కొండ వాసి కొమ్ము రాజేందర్.  తన ప్రతిభతో 2007లో రాష్ట్రస్థాయి, 2010లో జాతీయస్థా యి గ్రేడ్ 2 ఎంపైర్ ఎంపిక కోసం నిర్వహించిన పరీక్షల్లో ఉత్తీర్ణుడయ్యారు. అనంత రం 2013లో గ్రేడ్ 1 ఎంపికలో జాతీయస్థాయిలో 3వ ర్యాంకు సాధించి బ్యాడ్మింటన్ క్రీడా పోటీలకు టెక్నికల్ ఎంపైర్‌గా తన ప్రస్తానాన్ని ప్రారంభించా రు.

అప్పటి నుంచి ఇప్పటివరకు రాజేందర్ తన క్రీడా ప్రతిభను జో డించి అంపైర్‌గా అనేక జాతీయ, అంతర్జాతీ య పోటీలకు టెక్నికల్ ఎంపైర్‌గా వ్యవహరిస్తూ 2024లో పారిస్‌లో నిర్వహించిన పారా ఒలంపిక్స్ క్రీడా పోటీల్లో బ్యాడ్మింటన్ టెక్నికల్ అఫీషియల్ (ఎంపైర్)గా వ్యవహరించాడు.

రాజేందర్ ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లా కేసముద్రం జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో ఫిజికల్ డైరెక్టర్. ఫిజికల్ డైరెక్టర్‌గా విద్యార్థుల్లో క్రీడా ప్రతిభను వెలికితీస్తూ, ఉత్తమ సేవలు అందించినందుకుగాను 2010లో ఉమ్మడి రాష్ట్రంలో వరంగల్ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా, 2020లో తెలంగాణ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా, 2018లో అంతర్జాతీయ లయన్స్ క్లబ్ ఉత్తమ టీచర్ అవార్డు అందుకున్నారు. 

రాజేందర్ కెరీర్ సాగిందిలా..

2007లో రాష్ట్ర స్థాయిలో ఎంపైర్‌గా జీవి తం ప్రారంభమైంది. 2010లో నేషనల్ గ్రేడ్2 పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, హర్యానా (రోహ్టక్)లో నిర్వహించిన ఆల్ ఇండియా స్థాయిలో టాపర్‌గా నిలిచారు. 2013లో భోపాల్ (మధ్యప్రదేశ్)లో నిర్వహించిన నేషనల్ గ్రేడ్ 1 పరీక్షలో 4వ ర్యాంక్ సాధించారు. 2020లో బ్యాడ్మింటన్ వరల్ ఫెడరేషన్ (బీ.డబ్ల్యు.ఎఫ్) పనితీరు ఆధారంగా అంతర్జాతీయ టెక్నికల్ ఆఫిషియల్గా నామినేట్ అయ్యారు.

ప్రతిష్టాత్మక టోర్నమెంట్లలో ప్రాతినిధ్యం

రెండుసార్లు సీనియర్ వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్స్ (2009, 2011). బ్యాడ్మింటన్ ఆసియా 2016. ఆసియన్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్స్ (2016,2018). టాటా ఓపెన్ ఇంటర్నేషనల్  మూడుసార్లు (2014, 2016, 2018). ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (2016, 2017). థామస్ అండ్ ఉబర్ కప్  2014. ఇంటర్నేషనల్ చాంపియన్షిప్స్ 2009. ఆల్ ఇండియా పోలీస్ బ్యాడ్మింటన్ చాంపియన్షి ప్స్ 2010. ఇన్ఫోసిస్ ఇంటర్నేషనల్ చాంపి యన్షిప్స్ 2021. 2సార్లు ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ (2020, 2022). ౪సా ర్లు సీనియర్ నేషనల్ చాంపియన్షిప్స్. ౨సార్లు సౌత్ జోన్ చాంపియన్షిప్స్ (2016, 2018).

క్రీడల్లో డాక్టరేట్

ఎఫెక్ట్ ఆఫ్ అక్యూట్ మారథాన్ రన్నింగ్ ఆన్ ద అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్టు ఇన్ఫెక్షన్ స్టేటస్ అండ్ లంగ్ ఫంక్షన్ స్టేటస్ అమాంగ్ ది రిక్రియేషనల్ రన్నర్స్’ అనే అంశంపై పరిశోధన గ్రంథాన్ని సమర్పించడంతో 2025 లో జేఎన్టీయూ రాజేందర్‌కు ‘డాక్టరేట్’ బిరుదు ప్రధానం చేసింది.