16 April, 2026 | 7:25 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

భార్య మరణం తట్టుకోలేక భర్త ఆత్మహత్య

25-06-2025 11:20 PM

20 రోజుల వ్యవధిలో దంపతుల మృతి..

మహబూబాబాద్ (విజయక్రాంతి): భార్య మరణం తట్టుకోలేక భర్త పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) కేసముద్రం మండలం ఉప్పరపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. కేసముద్రం ఎస్ఐ మురళీధర్ రాజ్(SI Muralidhar Raj) కథనం ప్రకారం... సంఘటనకు సంబంధించి వివరాలు ఉన్నాయి. గ్రామానికి చెందిన జల్లి నిర్మల 20 రోజుల క్రితం సమీప బంధువుల తగాదలతో మనస్థాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.

ఈ క్రమంలో భార్య చనిపోయి మనస్థాపానికి గురైన భర్త బాబు తాగుడుకు బానిసై మంగళవారం భార్య సమాధి వద్దకు చేరుకొని గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బంధువులు అతన్ని మహబూబాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మరణించాడు. ఇరవై రోజుల వ్యవధిలో భార్య భర్త మరణించడం తీవ్ర విషాదాన్ని కలిగించింది.